మనవడి కోసం ఏ తాత చేయని పని చేసిన సూపర్ స్టార్.. సింప్లిసిటీకి ఫిదా అవ్వాల్సిందే?

సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో సీనియర్ నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్( Rajinikanth ) ఒకరు.

ఈయన ఒక గొప్ప నటుడు అయినప్పటికీ ఏ విధమైనటువంటి ఆర్భాటాలు లేకుండా ఒక సాధారణ వ్యక్తిలా ఉండటానికి ఇష్టపడతారు అనే సంగతి మనకు తెలిసిందే.

తాజాగా రజనీకాంత్ కుమార్తె సౌందర్య రజనీకాంత్ ( Soundarya Rajinikanth ) సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫోటోలు కనుక చూస్తే రజనీకాంత్ సింప్లిసిటీ ఏంటో అర్థం అవుతుంది.

సౌందర్య పెద్ద కుమారుడు వేద్ రజనీకాంత్ ఉన్న ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు.

"""/" / ఇక ఈ ఫోటోలు వెనుక ఉన్న స్టోరీని కూడా ఈ సందర్భంగా అభిమానులతో పంచుకున్నారు.

తన కుమారుడు స్కూల్ కి వెళ్ళనని నేడు చాలా మారం చేశాడు.దాంతో తాత రంగంలోకి దిగాడని సౌందర్య తెలిపారు.

తన మనవడు స్కూల్ కి వెళ్ళనని మారం చేయడంతో స్వయంగా రజనీకాంత్ గారు తన మనవడిని స్కూల్ కి తీసుకువెళ్లడమే కాకుండా ఒక సాధారణ వ్యక్తి లాగా తరగతి గదిలోకి వెళ్లి కూర్చోబెట్టి వచ్చారు.

"""/" / ఇలా వెండి తెరపై సందడి చేసే ఈయన ఒక సాధారణ వ్యక్తి లాగా స్కూల్ తరగతి గదిలోకి వెళ్లడంతో అక్కడున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఎంతో ఆశ్చర్యపోయారు.

ప్రస్తుతం ఈ ఫోటోలను షేర్ చేసిన ఈమె ఈ ఫోటోలు వెనుక ఉన్న స్టోరీ చెప్పడమే కాకుండా, ఆన్ స్క్రీన్ లోనే కాదు ఆఫ్ స్క్రీన్ లో ప్రతి పాత్రను పోషించడంలో మీరు దిట్టా అంటూ తన తండ్రి గురించి గొప్పగా చెప్పడమే కాకుండా బెస్ట్ తాత బెస్ట్ నాన్న అంటూ హ్యాష్ టాగ్ కూడా జోడించింది.

ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారడంతో నేటిజన్స్ సైతం ఈయన సింప్లిసిటీకి ఫిదా అవుతున్నారు.

వైరల్ వీడియో : రెచ్చిపోయిన పోకిరీలు.. నడిరోడ్డుపై కారును కాలుతో తంతూ..!