ఇండస్ట్రీలోకి రావాలనుకునే వారికి సౌందర్య అలాంటి సూచనలు చేశారా… ఏం చెప్పారంటే?

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతూ ఎన్నో అద్భుతమైన సినిమాలు చేస్తూ ఎంతో మంచి గుర్తింపు పొందినటువంటి వారిలో దివంగత నటి సౌందర్య( Saundarya ) ఒకరు.

ఈమె కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అచ్చ తెలుగు అమ్మాయిగా తెలుగులో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగినటువంటి సౌందర్య అతి తక్కువ సమయంలోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.

ఇలా సౌందర్య మరణించి రెండు దశాబ్దాలు అవుతున్నప్పటికీ ఇంకా ఈమెను మాత్రం అభిమానులు మర్చిపోలేదని చెప్పాలి.

ఇకపోతే జూలై 17వ తేదీ సౌందర్య జయంతి( Soundarya Jayanti ) కావడంతో మరోసారి అభిమానులు ఆమెను గుర్తు చేసుకున్నారు.

ఈ క్రమంలోనే గతంలో సౌందర్య ఇండస్ట్రీ గురించి చెప్పినటువంటి కొన్ని వీడియోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే ఇండస్ట్రీకి రావాలి అనుకునేవారు ఇండస్ట్రీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయో అని భయపడుతూ ఉంటారు.

ఇలా ఇండస్ట్రీలోకి రావాలి అనుకునే వారికి సౌందర్య కొన్ని సలహాలు సూచనలు చేశారని తెలుస్తుంది.

మరి సౌందర్య ఇచ్చిన సలహాలు ఏంటి అనే విషయానికి వస్తే. """/" / ఒకప్పుడు మా అమ్మాయి డాక్టర్ కావాలి ఇంజనీర్ కావాలని కోరుకునేవారు అయితే ప్రస్తుతం రోజులు మారిపోయాయి.

పిల్లలకు ఇష్టమైన రంగంలో వారిని ప్రోత్సహిస్తున్నారు.అయితే సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకునే వారు మాత్రం కొన్ని సందేహాలను వ్యక్తం చేస్తుంటారు.

ఇండస్ట్రీలో ఇబ్బందులు వస్తాయని,సినీ ఇండస్ట్రీ ( Cine Industry )మంచి వాతావరణం కాదు అంటూ చాలామంది ఇండస్ట్రీ పట్ల చెడు అభిప్రాయాలను కలిగి ఉంటారు అయితే ఈ విషయంపై సౌందర్య మాట్లాడుతూ ఇండస్ట్రీలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు రావు.

"""/" / ఇండస్ట్రీలోకి రావాలనుకునే వారు చాలా హ్యాపీగా రావచ్చు.ఇదేం చెడ్డది కాదు ఇండస్ట్రీలో నాకు ఎలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరగలేదని తెలిపారు.

ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత నువ్వు ఎలా ఉన్నావ్ అనేది ఇక్కడ ముఖ్యం.

నువ్వు ప్రొఫెషనల్ గా ఉంటే ఎలాంటి సమస్యలు ఉండవని ఈమె తెలిపారు.అయితే మనం ఏ రంగంలోకి వెళ్లినా కూడా సమస్యలు ఉంటాయి కానీ ఆ సమస్యలు అనేవి మన ప్రవర్తన పై ఆధారపడి ఉంటాయని ఇండస్ట్రీలో కూడా మన ప్రవర్తన పైనే మన జీవితం ఆధారపడి ఉంటుంది కానీ ఇండస్ట్రీలో ఎలాంటి సమస్యలు ఉండవు అంటూ సౌందర్య చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.