మంజుమ్మెల్ బాయ్స్” తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సౌబిన్ షాహిర్.. అతడి విశేషాలు ఇవే

సౌబిన్ షాహిర్( Soubin Shahir ) మలయాళ సినిమా ఇండస్ట్రీలో నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్నాడు.

మంజుమ్మెల్ బాయ్స్ సినిమాతో( Manjummel Boys ) ఈ నటుడు టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా క్రేజ్ పెంచుకున్నాడు.

ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఫిలిం జస్ట్ రూ.20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి దాదాపు రూ.

243 కోట్ల సంపాదించింది.డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో తెలుగు వెర్షన్ స్ట్రీమ్ అవుతోంది.

ఈ సినిమా తెలుగు ప్రేక్షకులు బాగా నచ్చింది.ముఖ్యంగా సౌబిన్ కరెక్టరైజేషన్ బాగుంటుంది.

సిజు డేవిడ్ అకా "కుట్టన్"గా అతడి నటన కూడా చాలామందికి తెగ నచ్చేసింది.

అందుకే ఇతని గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు.రోమంచం అనే 2023 హారర్ మూవీతో కూడా ఈ నటుడు తెలుగు ప్రేక్షకులను బాగా మెప్పించాడు.

నిజానికి సౌబిన్ సినిమా పరిశ్రమకు కొత్తేం కాదు.1990ల్లోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా మలయాళ వెండితెరపై అడుగుపెట్టాడు.

పెద్దయిన తర్వాత 2003లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా సినీ జీవితాన్ని రెస్యూమ్ చేశాడు.అనేక దర్శకుల దగ్గర పనిచేస్తూ సినిమాలు గురించి బాగా తెలుసుకున్నాడు.

సౌబిన్ 2013లో అన్నయుమ్ రసూలుమ్‌లో( Annayum Rasoolum ) సహాయ పాత్రతో తొలిసారిగా నటించాడు.

అప్పటినుంచి మలయాళ సినిమాల్లో ఎక్కువగా సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వస్తున్నాడు.సౌబిన్ "పారవ" చిత్రం డైరెక్ట్ చేసి ప్రేక్షకులతో పాటు విమర్శికుల ప్రశంసలు అందుకున్నాడు ఈ మూవీ కమర్షియల్ హిట్ అయింది.

"""/" / ఆ మూవీ పేరుతోనే "పారవ ఫిలిమ్స్ బ్యానర్"( Parava Films Banner ) ప్రారంభించాడు.

ఆ బ్యానర్ కింద మంజుమ్మెల్ బాయ్స్ ప్రొడ్యూస్ చేశాడు ఈ మూవీ వల్ల అతనికి చాలా లాభాలు వచ్చాయి.

2024 లో హైయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మలయాళ సినిమాగా ఇది రికార్డు సృష్టించింది.

దీని తర్వాత నడికార్ సినిమా చేసి ఈ నటుడు మెప్పించాడు.ఇప్పుడు $మచంటే మాలాఖా" మూవీలో ఈ యాక్టర్ నటిస్తున్నాడు.

"""/" / 2017, డిసెంబర్ 16న సౌబిన్ జామియా జహీర్‌ని( Soubin Jamia Zaheer ) పెళ్లి చేసుకున్నాడు.

జామియా ఒక మార్కెటింగ్ ప్రొఫెషనల్.ఆమె కొచ్చికి చెందినది.

ఈ దంపతులకు మే 2019లో ఒక కుమారుడు పుట్టాడు.తెలుగు స్ట్రైట్ మూవీ ఇతను చేయాలని చాలామంది కోరుకుంటున్నారు మరి ఆ కోరిక ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి.

ఇతనితో ఓ మంచి సినిమా తీయడానికి ఒక దర్శకుడు ముందుకు వస్తే బాగుంటుంది.

బలగం డైరెక్టర్ డైరెక్షన్ లో నితిన్.. ఈ సినిమాతో నితిన్ జాతకం మారడం ఖాయమా?