సారీ నేను పోటీ నుంచి తప్పుకుంటున్నా ! కాంగ్రెస్ అభ్యర్ధి సంచలనం
TeluguStop.com
ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ ( Telangana Congress )లో క్రికెట్ ఆశించి భంగపడిన నేతలు ఎంతోమంది తీవ్ర అసంతృప్తికి గురై కొంతమంది పార్టీ మారగా, మరి కొంతమంది రెబల్ గా పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు.
తెలంగాణలోని చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తుంది.అయితే దీనికి భిన్నంగా కాంగ్రెస్ అసెంబ్లీ టికెట్ కేటాయించినా, చివరి నిమిషంలో తాను పోటీ నుంచి తప్పుకుంటున్నానని, తన స్థానంలో వేరొకరికి అవకాశం ఇవ్వాలని , వారి గెలుపునకు తాను సహకరిస్తానని సంచలన ప్రకటన చేసిన ఘటన నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గంలో చోటుచేసుకుంది.
ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ సురేష్ షట్కర్ పేరును కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది .
అయితే చివరి నిమిషంలో ఆయన తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. పార్టీ హై కమాండ్ కి కూడా ఇదే విషయాన్ని తెలపడంతో, అక్కడ నుంచి టికెట్ ఆశించి అసంతృప్తి గురైన సంజీవరెడ్డిని అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించింది.
"""/" /
స్వయంగా సురేష్ షెట్కర్ ( Suresh Shetkar )పోటీ నుంచి తప్పుకుంటున్నాను అనే విషయాన్ని ప్రకటించడంతోపాటు, సంజీవరెడ్డికి పూర్తిగా సహకారం అందిస్తానని , ఆయనను గెలిపించుకుంటానని ప్రకటించారు .
నామినేషన్ వేసే కార్యక్రమానికి కూడా కానీ స్వయంగా వెళ్లి మద్దతు పలుకుతానని, నామినేషన్ దాఖలకు చివరి రోజున ప్రకటించడం సంచలనగా మారింది .
సురేష్ షెట్కర్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పెద్దలు కూడా స్వాగతించారు.ప్రస్తుతం ఇక్కడ అసెంబ్లీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న సంజీవరెడ్డికి టికెట్ ఖరారు కాకముందు ఆయన టికెట్ రాలేదని అసంతృప్తితో పార్టీ మారేందుకు కూడా సిద్ధమవుతున్న సమయంలో , సురేష్ షెట్కర్ ఈ నిర్ణయం తీసుకోవడంతో అంతా సద్దుమణిగింది.
"""/" /
గతంలోనూ కల్వకుర్తి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే వంశీ చంద్ రెడ్డికి( Vamsi Chand Reddy ) టికెట్ ఇవ్వడానికి కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించుకుంది.
అయితే తనకు టికెట్ అవసరం లేదని , ఇక్కడ నుంచి పోటీ చేయాలని ఆశిస్తున్న కసిరెడ్డి నారాయణరెడ్డి కి అవకాశం ఇవ్వాలని ప్రతిపాదించారు.
తాజాగా సురేష్ షెట్కర్ కూడా ఇదే విధంగా నిర్ణయం తీసుకోవడంతో ఆయనను పలువురు అభినందిస్తున్నారు.
పవిత్ర కుంభమేళాలో హైటెక్ టచ్.. ఒంటె వీపున QR కోడ్ చూసి షాకైన జనం!