జియో 5జీ వచ్చేస్తోంది.. అంబానీ ఏమన్నారంటే..!
TeluguStop.com
రిలయన్స్ 5 జీ నెట్‌వర్క్ త్వరలోనే తీసుకువస్తున్నామని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబారీ ప్రకటించారు.
దీంతో తమ సంస్థే భారత్‌లో జియోను పరిచయం చేస్తున్నట్లు దీమా వ్యక్త చేశారు.
విభిన్న ఆఫర్లతో కస్టమర్లకు ఆకట్టుకునే దిగ్గజ జియో ఇప్పడు తమ వినియోగదారులకు 5 జీ ప్రపంచాన్ని పరిచయం చేయాలని తహతహలాడుతోంది.
ఇప్పటికే దీనికి సంబంధించిన రెగ్యూలేటరీ ఆర్డర్లు వచ్చేసాయట.5జీ రిసోల్యూషన్‌తో పూర్తిగా భారతీయ సొల్యూషన్‌తో పరీ„ì ంచారు.
దీనిలో ఒక జీబీపీఎస్ స్పీడ్‌తో సక్సెస్ సాధించారు.ఇక తమ సేవలను విస్త్రతి చేయాలని.
వైద్య, విద్యా రంగాల్లో ఉపయోగించే సాఫ్ట్‌వేర్‌తో దీన్ని తయారు చేస్తున్నట్లు అధినేత తెలిపారు.
తమ సంస్థకు చెందిన కొన్ని విధ్యా సంస్థల్లో ఇప్పటికే ట్రయల్స్ వేస్తున్నారు.అంతేకాదు భారత్ అంటే 2జీ ముక్త్ మాత్రమే కాద 5జీ యుక్త్‌గా మారుతోందని’ ముఖేష్ తెలిపారు.
ఇప్పటికే 5జీ స్మార్ట్ ఫోన్లు వచ్చేసాయి.ఇక రావాల్సింది 5జీ నెట్‌వర్క్.
దీనికి ఇప్పటికే ఎంతో మంది ఎదురుచూస్తున్నారు.అసటు గత ఏడాదే దీనిపై అంబానీ ప్రకటించారు.
కానీ, కొన్ని విపత్కర పరిస్థితుల దృష్ట్యా ఇది ముందుకు సాగడానికి సమయం పట్టింది.
ఒకవైపు జియో స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే.ఇక నెట్ వర్క్‌ను వినియోగదారులకు అందించడంలో తన దైన స్టైల్‌లో దూసుకుపోతుంది.
దీంతో భారత్‌లో నవ ప్రపంచం పరిచయం కానుంది.జియో 5జీ పై అంచనాలు కూడా బాగానే ఉన్నాయి.
దీన్ని ప్రకటించిన ఆధారంగానే 5జీ స్మార్ట్‌ఫోన్లు కూడా మార్కెట్లలోకి విడుదలయ్యాయి.ఇప్పటికే రెగ్యులేటరీ అప్రూవల్స్ వచ్చాయి.
ఇక ఫీల్డ్ ట్రయల్ కోసం కసరత్తు చేస్తున్నారు.ఇది కూడా సులభంగా పూర్తి చేస్తామని దీమా వ్యక్తం చేశారు అంబానీ ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇక జియోతో పోరాడే సంస్థలు కూడా ముందుకు రావచ్చు.
"""/"/
జియోను పరిచయం చేసినప్పుడే అతి తక్కువ ధరలకు రీఛార్జ్ ప్లాన్లతో అందరినీ ఆశ్చర్య పరిచింది.
అంతేకాదు స్మార్ట్ ఫోన్లకు కూడా అతి తక్కువ ధరలకే పరిచయం చేస్తోంది.ఇక ఈ 5జీ నెట్‌వర్క్‌తో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం కూడా జియోకు ఉండకపోవచ్చు.
తమ ఖాతాలో మరింత మంది సబ్‌స్కైబర్లను చేర్చుకోవడానికే ప్రాముఖ్యతను ఇచ్చే జియో.వారికి ఆఫర్లను కూడా అదేవిధంగా ప్రకటిస్తుందో ఎదురుచూడాలి.
భరించలేకపోతున్నాను.. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన అల్లు అర్జున్!