తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లతో సోనీ ఇయర్‌బడ్స్ లాంచ్..

ప్రముఖ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ సోనీ ఇండియాలో తాజాగా WF-LS900N పేరుతో సరికొత్త ఇయర్‌బడ్స్‌ రిలీజ్ చేసింది.

కంపెనీ కొత్త ఇయర్‌బడ్స్‌లో సెన్సింగ్ టెక్నాలజీ అందించి 'నెవర్ ఆఫ్' ఎక్స్‌పీరియన్స్ ఆఫర్ చేస్తోంది.

అలానే వీటిలో సోనీ తన ఇంటిగ్రేటెడ్ ప్రాసెసర్ V1ని అమర్చింది.ఆ ప్రాసెసర్ సాయంతో ఈ ఇయర్‌బడ్స్ మెరుగైన నాయిస్ క్యాన్సిలేషన్, మెరుగైన సౌండ్ క్వాలిటీ.

తక్కువ డిస్టార్షన్‌ను అందజేస్తుంది.సోనీ WF-LS900N ఇయర్‌బడ్స్ రూ.

16,990 ధరతో ఇండియాలో రిలీజ్ అయ్యాయి.ప్రీమియం ఫీచర్లతో ఈ ధరలో ఇయర్‌బడ్స్ రిలీజ్ కావడం నిజంగా మ్యూజిక్ లవర్స్‌కి ఒక గుడ్‌న్యూస్ అని చెప్పొచ్చు.

దీని ధరను మరింత రూ.3,000 తగ్గించుకునేందుకు సెలెక్టెడ్ చేసిన డెబిట్/క్రెడిట్ కార్డ్‌లు ఉపయోగించాలి.

ఈ ఆఫర్ 2022 నవంబర్ 30 వరకు అందుబాటులో ఉంటుంది.ఈ WF-LS900N ఇయర్‌బడ్స్‌ నవంబర్ 25, 2022 నుంచి అన్ని భారతీయ సోనీ సెంటర్లు, ప్రధాన ఎలక్ట్రానిక్స్ రిటైలర్లు, ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి.

కొత్త బడ్స్ బ్లాక్, వైట్, లేత గోధుమరంగుతో సహా 3 కలర్ ఆప్షన్స్‌తో లాంచ్ అయింది.

"""/"/ నయా ఇయర్‌బడ్స్‌ నాయిస్ క్యాన్సిలింగ్ ఆన్‌తో గరిష్ఠంగా 6 గంటల బ్యాటరీ లైఫ్ ఆఫర్ చేస్తాయి.

ఛార్జింగ్ కేస్‌తో అదనంగా 20 గంటలు ప్లే బ్యాక్ అందుకోవచ్చు.కేవలం 5 నిమిషాల ఛార్జింగ్‌తో 60 నిమిషాల వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది.

వీటిలో ఆఫర్ చేసిన బ్లూటూత్ 5.2 ద్వారా డివైజ్‌లకు ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు.

మల్టీపాయింట్ కనెక్షన్‌ని ఉపయోగించి ఒకేసారి రెండు బ్లూటూత్ డివైజ్‌లతో కనెక్ట్ చేయవచ్చు.