గొప్పమనస్సు చాటుకున్న సోనూసూద్.. పిల్లల కోసం ఏకంగా..?

కలియుగ కర్ణుడిగా కష్టాల్లో ఉన్న ఎంతో మందికి సహాయం చేసి వార్తల్లో నిలిచారు సోనూసూద్.

తెలుగులో గత రెండు దశబ్దాలుగా ఎన్నో విలన్ పాత్రల్లో నటించిన సోనూసూద్ ను దేశంలోని ప్రజలు మాత్రం హీరోగానే భావిస్తున్నారు.

సినిమాల్లో సైతం గతంలో పోషించిన పాత్రలకు భిన్నంగా పాజిటివ్ పాత్రలనే సోనూసూద్ ఎంపిక చేసుకుంటున్నారు.

ఇప్పటికే ఎన్నో సహాయాలు చేసిన సోనూసూద్ చిన్నారులకు సాయం చేసి వార్తల్లో నిలిచారు.

ఉత్తరాఖాండ్ రాష్ట్రంలో కొన్ని రోజుల క్రితం జలప్రళయం సంభవించిన సంగతి తెలిసిందే.ఈ జలప్రళయంలో ఒక కార్మికుడు చనిపోగా ఇంటి పెద్ద చనిపోవడంతో నలుగురు ఆడపిల్లలకు ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి.

అయితే ఆ కార్మికుని కుటుంబాన్ని ఆదుకుంటానని సోనూసూద్ హామీ ఇచ్చారు.ఆ కుటుంబాన్ని దత్తత తీసుకుంటానని.

నలుగురు ఆడపిల్లల చదువు కోసం అయ్యే ఖర్చును తానే భరిస్తానని సోనూసూద్ హామీ ఇచ్చారు.

"""/"/ కష్టాల్లో ఉన్న పేద ప్రజలను ఆదుకునే దిశగా సోనూసూద్ అడుగులు వేయడం గమనార్హం.

జల ప్రళయంలో ఆలం సింగ్ అనే ఎలక్ట్రీషియన్ పని చేసే కార్మికుడు చనిపోగా అతని కూతుళ్లంతా చిన్నపిల్లలు కావడం గమనార్హం.

బాధిత కుటుంబం దగ్గరకు తన బృందాన్ని పంపి పూర్తి వివరాలను, ఆ కుటుంబ సమస్యలను తెలుసుకోగా ఆ కుటుంబ బాధ్యతలను తాను తీసుకుంటానని సోనూసూద్ ప్రకటన చేశారు.

సోనూసూద్ సాయం గురించి నెట్టింట వైరల్ అవుతుండగా నెటిజన్లు సోనూసూద్ ను ప్రశంసిస్తున్నారు.

ప్రస్తుతం సోనూసూద్ ఆచార్య సినిమాతో పాటు మరికొన్ని సినిమాల్లో కూడా నటిస్తున్నారు.భవిష్యత్తులో సోనూసూద్ హీరోగా కూడా నటించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

సోనూసూద్ రాజకీయాల్లోకి కూడా రావాలని ఆయన అభిమానులు కోరుతున్నారు.చాలామంది సినీ నటుల్లా సోనూ భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తారేమో చూడాల్సి ఉంది.

సర్క్యులర్ తప్పైతే జైలుకు వెళ్తా.. మాజీ మంత్రి కేటీఆర్ కామెంట్స్