ప్రముఖ నటుడు సోనూసూద్ కు మళ్లీ నోటీసులు.. అసలేం జరిగిందంటే?

రియల్ హీరో సోనూసూద్ ఎన్నో మంచి పనులు చేయడంతో పాటు ఆ మంచి పనుల ద్వారా వార్తల్లో నిలిచారు.

కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సమయంలో ఆపదలో ఉన్న ఎంతోమందిని సోనూసూద్ ఆదుకున్నారు.

సోనూసూద్ తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.ఆ సేవా కార్యక్రమాలు సోనూసూద్ కు పేరుప్రతిష్టలను పెంచుతున్నాయి.

అయితే తాజాగా సోనూసూద్ మరోసారి నోటీసులను అందుకున్నారు.బీఎంసీ సోనూసూద్ హోటల్ కు సంబంధించి మరోసారి నోటీసులను జారీ చేయడం గమనార్హం.

ముంబైలో ఉండే ఆరంతస్థుల భవనంలో సోనూసూద్ హోటల్ ను నడుపుతున్నారు.రెసిడెన్షియల్ భవనంలో హోటల్ నడపటం సమస్యకు కారణమైంది.

రూల్స్ ప్రకారం రెసిడెన్షియల్ బిల్డింగ్ లో హోటల్స్ వంటి వ్యాపారంను నిర్వహించకూడదు.అలా నిర్వహించడం వల్లే ముంబైలోని మున్సిపల్ కార్పొరేషన్ నుంచి సోనూసూద్ కు నోటీసులు అందాయి.

కోర్టులో కూడా సోనూసూద్ కు అనుకూలంగా తీర్పు రాలేదు.న్యాయస్థానం సైతం గృహసముదాయంలో వ్యాపార కార్యకలాపాలను ఏ విధంగా నిర్వహిస్తారని ప్రశ్నించింది.

"""/" / గతంలో సోనూసూద్ ఆ భవనంను తిరిగి రెసిడెన్షియల్ భవనంగా మారుస్తానని మాట ఇచ్చారు.

అయితే ఆ మాటను ఇప్పటివరకు సోనూసూద్ నిలబెట్టుకోలేదు.తాజాగా మరోసారి నోటీసులు రావడంతో సోనూసూద్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

"""/" / మరోవైపు సోనూసూద్ ఫ్యాన్స్ మాత్రం సోనూసూద్ ను అధికారులు కావాలని టార్గెట్ చేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు.

సోనూసూద్ చేస్తున్న సేవా కార్యక్రమాలు కొంతమందికి నచ్చడం లేదని అందుకే ఈ విధంగా టార్గెట్ చేస్తున్నారని సోనూసూద్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మరోవైపు సోనూసూద్ కు సినిమా ఆఫర్లు అంతకంతకూ పెరుగుతున్నాయి.సోనూసూద్ తన రెమ్యునరేషన్ ను భారీగా పెంచారని వార్తలు వస్తున్నా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

మరి కొందరు మాత్రం సోనూసూద్ ఈ సమస్యను పరిష్కరించుకుంటే మంచిదని కామెంట్లు చేస్తున్నారు.

మహేష్ బాబు సినిమాను తక్కువ అంచనా వేసిన స్టార్ ప్రొడ్యూసర్…