కరోనాపై సెటైర్ వేసిన సోనూసూద్..ట్వీట్ వైరల్..!

సోనూ సూద్ పేరు ఈ మధ్య కాలంలో బాగా వినపడుతుంది.ఈయన చాలా సినిమాల్లో విలన్ గా నటించినప్పటికీ రియల్ లైఫ్ లో మాత్రం హీరో అని అనిపించుకున్నాడు.

కరోనా కష్టకాలంలో ఎంతో మంది ఆపదలో ఉన్నవారికి సహాయం చేసిన సోను సూద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ప్రజల కష్టాలకు స్పందించి ప్రజల గుండెల్లో రియల్ హీరోగా నిలిచాడు.కొందరు సోను సూద్ పై ఉన్న అభిమానంతో అతనికి గుడి కూడా కట్టించారు.

ఎంతో మంది వలస కార్మికులకు తన సొంత డబ్బులను ఉపయోగించి వారి ఇళ్లకు చేర్చడానికి బస్సులు, కార్లు, విమానాలు ఏర్పాటు చేసి వారిని వారి వారి స్వస్థలాలకు చేర్చాడు.

లాక్ డౌన్ తర్వాత కూడా ఎంతో మంది పేద విద్యార్థులకు, రైతులకు ఆయన అందించిన సేవలకు దేశం మొత్తం ఆయనను పొగడ్తలతో ముంచెత్తింది.

జనాలు రియల్ హీరో అని మెచ్చుకున్నా సోనూసూద్ మాత్రం మానవత్వంతో కష్టంలో ఉన్న వారికి సహాయం చేయడమే నా విధి అని తెలియజేస్తూ మరోసారి తన మంచి మనసును, మానవత్వాన్ని చాటుకున్నారు.

అయితే ఈ మధ్యే కరోనా సెకండ్ వేవ్ విజృభిస్తుంది.మునుపటి కంటే శక్తివంతంగా మారి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంది.

ఇప్పటికే ఇండస్ట్రీకి చెందిన చాలా మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.తాజాగా సోనూ సూద్ కూడా కొరోనా బారిన పడ్డాడు.

ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆందోళనలో ఉన్నారు.సోనూ సూద్ ఆరోగ్య పరిస్థితిపై అందరూ ఆరా తీయడం మొదలు పెట్టారు.

ఆయన ఆరోగ్యం ఎలా ఉందొ తెలుసుకోవడానికి వేల మంది అభిమానులు ఆయనకు ఫోన్లు చేస్తూ, మెసేజ్ లు చేస్తూ ఎలా ఉంది అని అడుగుతున్నారట.

అందుకే ఆయన ఈ రోజు ట్విట్టర్ లో ఒక ట్వీట్ పెట్టాడు. """/"/ ఆయన పోస్ట్ చేస్తూ.

నా ఆరోగ్యం గురించి ఎవ్వరూ కంగారు పడొద్దు.నేను బాగానే ఉన్నాను.

నా వల్ల కరోనా నే సఫర్ అవుతుంది.అంటూ కరోనా పైనే సెటైర్ వేసాడు.

ఆయన అభిమానులు కంగారు పడుతున్నారని సోనూసూద్ ట్విట్టర్ లో ఈ పోస్ట్ చేసాడు.

ఇది ఇలా ఉండగా ఈయన ప్రస్తుతం చిరంజీవి ఆచార్య సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు.

సంక్రాంతికి వస్తున్నాం మమ్మల్ని బావి నుంచి బయటపడేసింది.. నిర్మాత సంచలన వ్యాఖ్యలు!