పర్సన్ అఫ్ ది ఇయర్ గా సోనూసూద్

కరోనా కష్టకాలంలో ఎంతో మందికి ఆపన్నహస్తం అందించిన ఈ ఏడాది మోస్ట్ సెర్చింగ్ వెర్షన్ గా మారిపోయిన నటుడు సోనూసూద్.

లాక్ డౌన్ సమయంలో వలస కార్మికులకి సాయం అందించడం నుంచి మొదలు పెట్టి ఇప్పటి వరకు రెగ్యులర్ గా ఏదో ఒక సేవా కార్యాక్రమం, ఆపన్నులకి హస్తం అందిస్తూ తన గొప్ప మనసుని సోనూసూద్ అందరికి పరిచయం చేశాడు.

తన సేవల కోసం ఏకంగా 10 కోట్లు విలువ చేసే ప్రాపర్టీని కూడా తాకట్టు పెట్టేశాడు.

తన సేవాగుణంతో సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అందరిచేత రియల్ హీరో అనిపించుకుంటున్నాడు.

తాజాగా ఆచార్య షూటింగ్ లో మెగాస్టార్ చిరంజీవి సైతం ఓ యాక్షన్ ఎపిసోడ్ లో సోనూసూద్ ని కొట్టడానికి ఇబ్బంది పడ్డారంటే వ్యక్తిత్వంలో ఎంత గొప్పగా ఎదిగిపోయాడో అర్ధం చేసుకోవచ్చు.

ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సోనూసూద్ చేసే సాయానికి సోషల్ మీడియా కూడా నీరాజనాలు పడుతుంది.

అందుకే ఈ ఏడాది స్టార్ హీరోలని మించిపోయే విధంగా అతని ఇమేజ్ పెరిగిపోయింది.

"""/"/ అదే సమయంలో ఇప్పుడు సోనూసూద్ కి ఇండస్ట్రీలో కూడా గౌరవం దక్కింది.

అతను హీరోగా సినిమాలు చేయడానికి నిర్మాతలు ముందుకొస్తున్నారు.ఇదిలా ఉంటే ప్పుడు సోనూసూద్ మరో అరుదైన గౌరవం సొంతం చేసుకున్నాడు.

క‌రోనా ప‌రిస్థితుల్లో గొప్ప హృద‌యంతో స్పందించిన సోనూసూద్ ప‌ర్స‌న్ ఆఫ్ ది ఇయర్-2020గా నిలిచాడు.

క‌రోనా వంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో సోనూసూద్ అందించిన సేవ‌ల‌కు ఆయ‌న‌ను యూఎన్డీపీ స్పెష‌ల్ హ్యుమానిటేరియ‌న్ అవార్డుతో స‌త్క‌రించింది.

స్వచ్చంధ సంస్థలు, వరల్డ్ ఎన్జీవోలు సోనూసూద్ సేవలని గుర్తించి అతన్నీ సత్కరిస్తున్నాయి.మరి భారత్ ప్రభుత్వం ఏ విధంగా సోనూసూద్ సేవలని గుర్తించి గౌరవిస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

9 నెలల్లో 6 సినిమాలు విడుదల.. ఈ స్టార్ హీరోకు పోటీనిచ్చే మరో హీరో ఉన్నారా?