బోయపాటి-బాలయ్య సినిమాలో విలన్ గా సోనూసూద్
TeluguStop.com
నటుడుగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న సోనూసూద్ ఈ కరోనా కష్టకాలంలో ప్రజలకి నిజమైన హీరోలా కనిపించాడు.
లాక్ డౌన్ సమయంలో సొంత ఊళ్ళకి వెళ్ళడానికి అవస్థలు పడుతున్న వలస కూలీలని గమ్యస్థానానికి చేర్చడంతో పాటు, ఎప్పటికప్పుడు ఏదో ఒక రూపంలో ఎక్కడో ఒక చోట తన దొడ్డ మనసు చూపిస్తూ కష్టంలో ఉన్నవారికి నేనున్నా అంటూ ఆదుకుంటున్నాడు.
సాయం చేసే వ్యక్తుల చుట్టూ సాయం కోరే చేతులు ఉంటాయనే విధంగా ఇప్పుడు దేశ వ్యాప్తంగా లక్షలాది మంది ఏదో ఒక సాయం కోరుతూ అతనికి ట్విట్టర్ లో మెసేజ్ పంపుతున్నారు.
వీటిలో కొన్ని రియల్ ఉంటే మరికొన్ని అసహనం పెంచే విధంగా ఉన్నాయి.ఏది ఏమైనా తన సేవాగుణంతో సోనూసూద్ సినిమాలో విలన్ అయినా నిజజీవితంలో హీరో అనిపించుకున్నాడు.
దీంతో దేశ వ్యాప్తంగా సోనూసూద్ కి ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది.అతనిని గుండెల్లో పెట్టుకొని అభిమానించేవారు ఉన్నారు.
అలాగే గతంలో కొంత వరకు సోనూసూద్ కి సినిమా అవకాశాలు తగ్గిన మరల దర్శక, నిర్మాతలు అతని క్రేజ్ ని క్యాష్ చేసుకోవడానికి అవకాశాలతో క్యూ కడుతున్నారు.
అయితే ఎప్పటిలానే అతని దగ్గరకి వెళ్లేవారు ఎక్కువగా నెగిటివ్ రోల్స్ మాత్రమే ఇస్తున్నారు.
తెలుగులో అల్లుడు అదుర్స్ సినిమాలో సోనూసూద్ విలన్ గా నటిస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ లో తాజాగా సోనూసూద్ పాల్గొన్నాడు.
ఇదిలా ఉంటే బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో సెట్స్ పైకి వెళ్ళబోతున్న హ్యాట్రిక్ సినిమాలో సోనూసూద్ ని విలన్ గా ఫైనల్ చేసినట్లు టాక్ నడుస్తుంది.
అతను ఉంటే పవర్ ఫుల్ విలనిజం చూపించడంతో పాటు సినిమాకి కూడా కావాల్సినంత హైప్ వస్తుందని, బాలకృష్ణతో ఢీకొట్టే రేంజ్లోనే అతని పాత్ర ఉంటుందని బోయపాటి భావించి సోనూని ఫైనల్ చేసినట్లు టాక్.
త్వరలో ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ ఎనౌన్సమెంట్ వచ్చే అవకాశం ఉందని సమాచారం.
షాకింగ్: బంగారు నాలుకలున్న 13 మమ్మీలు.. ఎందుకో తెలిస్తే మతి పోవాల్సిందే..