యాహూ పరంగా హీరో ఆఫ్ ది ఇయర్ ఎవరో తెలుసా..?!
TeluguStop.com
ఈ మధ్య కాలం లో ఒకే కుటుంబంలో కష్టాల్లో ఉన్న మరో వ్యక్తిని కాపాడుకోవడానికి ఎంతగానో ఆలోచించి రోజులివి.
ఒక్కడు ఎలా పోతే ని తాను సుఖంగా ఉన్నాను లేదా అని భావించేవారు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి.
ఇలాంటి రోజులలో వేలాది మందికి సహాయం వారు అడగక పోయినా సరే తనంతటతానే సాయం అందించిన వారు లేకపోలేదు.
ఎంత ఆస్తి ఉన్నా కానీ దానం చేయాలన్న హృదయం ఉంటేనే అవతలి వారి ఆకలి తీరుతుంది.
కేవలం మాటల్లో కాదు తన చేతుల్లో చేసి చూపించాడు రీల్ విలన్ సోను సూద్.
"""/"/
కరోనా వైరస్ కష్ట కాలంలో ఎంతోమంది వలస కార్మికుల జీవితాలకు ఆరాధ్య దేవుడు గా మారాడు ఈయన.
వలస కార్మికులు వారి ఊర్లకు చేరుకోవడానికి ఇబ్బందులు పడుతున్న సమయంలో ఎంతో మందికి బస్సు, రైలు, విమానలలో ఎలా వీలైతే అలా వారిని వారి సొంత ఊర్లకు చేరుకోవడానికి ఎంతో సహకారం అందించాడు సోనుసూద్.
అంతేకాదు ఎంతోమంది జీవితాల్లో ఆయన వెలుగు ను కూడా నింపాడు.కాబట్టి ఆయనకు ఎన్ని సత్కారాలు చేసిన తక్కువే.
ప్రస్తుతం ఆయనకు గుడి కట్టే స్థాయికి ఎదిగి పోయాడు ప్రజల దృష్టిలో.కాబట్టి, తాజాగా ఆయన హీరో ఆఫ్ ది ఇయర్ ను గెలుచుకున్నారు.
ఈ విషయాన్ని తాజాగా యాహూ సంస్థ ప్రకటన చేసింది.సోను సూద్ అంటే ఓ మంచి నటుడు మాత్రమే కాదని అతడు గొప్ప మనసున్న వాడని తెలుపుతూ దక్షిణ భారత దేశంతోపాటు ఉత్తరాది భారతదేశంలో కూడా ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉన్న నటుడిగా గుర్తింపు ఉందని తెలిపింది.
సినిమాల్లో విలన్ క్యారెక్టర్ పోషించిన ఆయన రియల్ లైఫ్ లో హీరో అయిపోయాడు అని యాహు సంస్థ తెలిపింది.
ఇందులో భాగంగానే తాజాగా హీరో ఆఫ్ ది ఇయర్ అంటూ సోనుసూద్ ను ప్రకటించింది.
ఈ మధ్య కాలంలో ఆయన నటిస్తున్న సినిమాల షూటింగ్ దగ్గరకు వెళ్లి మరి ఆయనను కలిసిన వారు ఎందరో.
అంతేకాదు తన తోటి సహచరులతో కలిసి నటిస్తున్న కానీ ఆయనను ఇప్పుడు సహచర నటులు కూడా ఎంతగానో ఆయనను అభిమానిస్తున్నారు.
కోతి-కింగ్ కోబ్రా స్నేహం.. ఏకంగా మెడలో వేసుకొని.. వీడియో వైరల్