మరొక్క సారి వార్తల్లో నిలిచిన సోనూసూద్… ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు
TeluguStop.com
కరోనా ప్రపంచాన్ని ఎంతలా కుదిపేసిందో మనందరికి తెలుసు.ఒక్కసారిగా మనుషుల జీవితాలు తలకిందులైన పరిస్థితి ఉంది.
ఇక సాధారణ ప్రజలు, వలస కార్మికులు పడ్డ ఇబ్బందులు మామూలువి కావు.ఆ సమయంలో నటుడు సోనూసూద్ చేసిన సేవలతో ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందాడు.
తెర మీద విలన్ గా క్రూరమైన పాత్రలు పోషించే సోనూసూద్ మనసు ఇంత మంచిదని రుజువైంది.
కరోనా సమయంలోనే కాక ఎవరికైనా నిరుపేదలకు తీవ్ర అనారోగ్య సమస్యలు ఉంటే ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తూ నిరుపేదల పాలిట దేవుడిగా నిలుస్తున్నాడు.
ఇప్పటివరకు ఎంతో మంది నిరుపేదలకు పునర్జన్మ నిచ్చిన సోనూసూద్ ఇప్పుడు మరొక్కసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు.
తందూరీ రోటీ చేసుకునే ఓ మహిళకు తన ధాబాలో తందూరీ వ్యాపారం చేసుకునే అవకాశం కల్పించి మహిళకు అండగా నిలిచాడు.
ఈ విషయంపై ట్విట్టర్ లో సోనూసూద్ ఓ వీడియో విడుదల చేసాడు.తందూరీ రోటీ ఎంతో రుచిగా ఉంటుందని, మంచి రుచికరమైన తందూరీ రోటీని తినాలనుకునే వారు సోనూసూద్ ధాబాకు విచ్చేయాలని వీడియో సందేశంలో సోనూసూద్ తెలిపారు.
ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.మరొక్క సారి గొప్ప మనసు చాటుకున్న సోనూసూద్ ను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
ఈ ముగ్గురు దర్శకుల మధ్య భారీ పోటీ ఉండనుందా..?