సోనూ సూద్ సాయం.. ఆ గ్రామాన్ని మొత్తం అలా కాపాడారు!

కరోనా సమయంలో నేనున్నా అంటూ ప్రజల గుండెల్లో ధైర్యం నింపిన సినీ నటుడు సోను సూద్ గురించి ఎంత చెప్పినా తక్కువే.

ఎందుకంటే ఆయన చేసిన సేవ అంతా ఇంతా కాదు.ఆయన చేసిన సేవకు ఓ గ్రామస్థులు ఏకంగా గుడి నే కట్టించారు.

ఆయన సేవలకు రాజకీయ నాయకుల నుండి విమర్శలు కూడా ఎదురవ్వగా.అవ్వని పట్టించుకోకుండా అందరికి సహయపడుతున్నాడు.

కరోన వైరస్ సమయంలో వలస కార్మికుల నుండి ప్రతి ఒక్కరిని తమ సొంత గూటికి పంపిస్తూ హీరో గా నిలిచాడు.

తన నటనా జీవితంలో విలన్ గా నటించిన సోనూ సూద్ నిజ జీవితంలో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

ప్రజల గుండెల్లో దేవుడి గా మారాడు.ప్రతి ఒక్కరిని నా అనుకుంటా.

నేనున్నా అంటూ ప్రతి ఒక్కరి బాధలను తన బాధ అనుకోని సహాయపడ్డాడు.అంతే కాకుండా ఆయనకు సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లను కూడా స్పందిస్తూ వాళ్లకు ఉన్న సమస్యలను దూరం చేస్తాడు సోనూసూద్.

"""/"/ రైతులకు, విద్యార్థులకు కొంతవరకు సహాయం చేస్తూ.రాజకీయ నాయకుల నుండి కొన్ని అడ్డంకులు కూడా ఎదుర్కొన్నాడు.

ట్విట్టర్ వేదికగా సోనూ సూద్ కు సహాయం కావాలని ఎంతోమంది కోరగా వెంటనే అది ఏంటి అని పూర్తిగా తెలుసుకోక ముందే రంగంలోకి దిగే వాడు.

ఇప్పటివరకు ఏదో ఒక రూపంలో ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ వస్తున్నా సోనూ సూద్ కు ఇటీవలే ఓ నెటిజన్ సహాయం కోరాడు.

ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ వ్యక్తి తమ గ్రామంలో ఓ కోతి దాడి ఎక్కువగా ఉండటంతో.

ఆ గ్రామంలో మొత్తం ఆ కోతి కారణంగా 25 మందికి గాయాలు పాలయ్యారని తెలిపాడు.

దాని నుంచి కాపాడమంటూ ట్విట్టర్ లో సోనూసూద్ కు తెలిపాడు.దీంతో వెంటనే స్పందించిన సోనూసూద్ కోతులు పట్టించే వాళ్లని పిలిపించి వెంటనే ఆ కోతిని పట్టించి అడవుల్లోని వదిలేసేలా చేశాడు.

ఈ విధంగా గ్రామ ప్రజలు మొత్తం ఆయన సహాయం మరువలేము అంటూ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు.

స్పెషల్ జానర్లతో ప్రయోగాలు చేస్తున్న రామ్ చరణ్.. ఆ రెండూ చాలా స్పెషల్..?