బాలయ్య సినిమాలో లాక్‌డౌన్ హీరో..?

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ షూటింగ్‌ను తిరిగి ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ ఇప్పటికే రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే.

మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తుండటంతో బాలయ్య ఈ సినిమాతో అదిరిపోయే సక్సెస్ అందుకునేందుకు రెడీ అవుతున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా తొలి షెడ్యూల్‌ను కొంతమేర షూటింగ్ జరుపుకున్న చిత్ర యూనిట్, లాక్‌డౌన్ తరువాత ఇప్పుడు మళ్లీ షూటింగ్ మొదలుపెట్టాలని చూస్తోంది.

ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్నమైన పాత్రల్లో మనకు కనిపిస్తాడని చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపింది.

కాగా ఇందులో ఒకటి రైతు పాత్రకాగా, మరొకటి అఘోరా పాత్ర.ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన ఇద్దరు హీరోయిన్లు కూడా ఉంటారని చిత్ర వర్గాలు అంటున్నాయి.

అయితే ఈ సినిమాలో బాలయ్యను ఢీకొట్టే విలన్ పాత్రలో ఎవరిని తీసుకోవాలా అనే ఆలోచనలో చిత్ర యూనిట్ పడింది.

గతంలో ఈ సినిమాలో విలన్ పాత్రలో సంజయ్ దత్‌ను తీసుకోవాలని చిత్ర యూనిట్ భావించినా, ఎందుకో ఆ ప్లాన్ నుండి డ్రాపవుట్ అయ్యింది.

కాగా ఆ తరువాత పలువురు బాలీవుడ్ నటుల పేర్లు వినిపించినా, ఎవరినీ ఫిక్స్ అయితే చేయలేకపోయారు.

ఇప్పుడు బాలయ్యను ఢీకొట్టేందుకు విలన్‌గా సోనూ సూద్‌ను తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్ జనాలకు బాగా సుపరిచితుడైన సోనూ సూద్, ఇటీవల లాక్‌డౌన్ కాలంలో యావత్ భారతదేశం చూపును తనవైపుకు తిప్పుకున్నాడు.

అనేక మందికి సాయం చేస్తూ వస్తోన్న ఈ రియల్ లైఫ్ హీరో ఇప్పుడు రీల్‌లో మాత్రం విలన్ పాత్రలో నటించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

బాలయ్య చిత్రంలో విలన్‌గా నటించేందుకు సోనూ సూద్ ఓకే చెప్పినవెంటనే ఆయనతో షూటింగ్ ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

మరి బాలయ్య చిత్రంలో సోనూ సూద్ విలన్ పాత్రలో నటిస్తాడా లేడా అనేది తెలియాలంటే చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసే వరకు ఆగాల్సిందే.

కండోమ్ యాడ్ కు ఆ హీరోయిన్ పర్ఫెక్ట్ ఛాయిస్.. బిజినెస్ మేన్ కామెంట్లపై విమర్శలు!