బిగ్ బాస్ 8: సోనియా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ, అలా చేసిందేమిటి?
TeluguStop.com
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 షో ( Bigg Boss Telugu Season 8 Show )చూపరులను ఎంతగానో అలరిస్తోంది.
ఇప్పటి వరకు టెలికాస్ట్ అయిన 7 సీజన్లకంటే కూడా ఇప్పుడు నడుస్తున్న 8వ సీజన్ ఒక రేంజులో బుల్లితెరపై దూసుకుపోతోంది అని నిర్వాహకులే స్వయంగా చెప్పుకొస్తున్నారు.
ఇక ఈ షోని ఫాలో అవుతున్న వారికి కంటెస్టెంట్ సోనియా( Contestant Sonia ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.
అందంతో పాటు ఆటతీరు సోనియాకి చాలా ప్లస్ అని చెప్పుకోవచ్చు.అదే సమయంలో ఆమె ఆ బిగ్ బాస్ షో కల్చర్‌కు సూట్ కాలేదని కూడా చెప్పుకోవచ్చు.
ప్రతిచోటా రాజకీయం ఉన్నట్టే బిగ్‌బాస్ షోలో కూడా కుళ్ళు రాజకీయాలకు కొదువేం కాదు.
"""/" /
రెండు, మూడు వారాలు బాగానే ఆడినప్పటికీ ఆ తరువాత ఎందుకనో బాగా తడబడింది.
దాంతో ఇక షోలో ఎక్కువ రోజులు ఉండలేకపోయింది.కట్ చేస్తే ఇపుడు నాలుగవ వారాంతంలోనే అందరూ ఊహించినట్టుగానే ఎలిమినేట్ ( Eliminate )అయిపోయింది.
ఆమెకు షోలో ఏ స్ట్రాటజీతో ఆడాలో కూడా ఓ పట్టాన అర్ధం కాలేదు.
ఆమె సోషల్ మీడియా టీం కూడా హుందాగా వోట్లు అడిగిందే తప్ప ఎక్కడా అతి చేయలేదు.
ఎక్కడా సింపతీ ఓట్లను దోచేద్దాం అని గీత దాటలేదు.ఆమె లా గ్రాడ్యుయేట్, ఎన్జీవోతో ప్రొ కన్సర్న్ యాక్టివిటీ కూడా.
అందుకే ఆమె షోలో ఇమడలేకపోయి, వెళ్లిపోయింది.ఎంట్రీ సమయంలోనూ నాగార్జున( Nagarjuna ) ఎదుట మిగతా కంటెస్టెంట్లలా ఓవరాక్షన్ చేయలేదు.
జస్ట్ అలా ఓ దండం పెట్టి హౌజులోకి అడుగు పెట్టింది. """/" /
ఇక హౌస్ లోనుండి బయటకి వచ్చేసేటప్పుడు కూడా చాలా కూల్ గా బయటకు వచ్చేసింది.
నాగార్జునకు సింపుల్ గా ‘బై సర్’ అని షేక్ హ్యాండ్ ఇచ్చేసి వెళ్లిపోయింది.
దాంతో కొంతమంది సోనియాకి ఎందుకంత ఆటిట్యూడ్ అని మాట్లాడుకుంటున్నారు.ఆటిట్యూడ్ ఎందుకుండదు? ఉంటుంది.
ఆమె అందరిలాగా డ్రాప్ అవుట్ కాదు.లా చదివింది, ఒక ఉన్నతమైన పొజిషన్లో ఉంది.
అందుకే తన ఆత్మాభిమాన్ని చంపుకోలేదు.కేవలం ఇంటరెస్ట్ తోనే తప్పితే ఆమె బిగ్ బాస్ లోకి మరే ఇతర కారణాలతోను అడుగుపెట్టలేదు.
ఇక డబ్బులు ఆమెకి సమస్యే కాదు.చాలామంది అనుకుంటున్నట్టుగా సోనియా డబ్బులు కోసం షోకి రాలేదు.
ఆమెకి అవసరం లేదు కూడా! అందుకే ఆమెకి నాగార్జుల లాంటి సెలిబ్రిటీలు కూడా చాలా సాధారణంగా కనబడతారు.
ఇక్కడ ఆమె ఎక్కడా గొప్పలకు పోలేదు.
వైరల్: అరటిపండును ఇలా ఎపుడైనా తిన్నారా? అమ్మబాబోయ్!