రెండో పెళ్లి గురించి సోనియా అగర్వాల్ షాకింగ్ కామెంట్స్ .. ఏమైందంటే?
TeluguStop.com

7/జీ బృందావన కాలనీ సినిమాతో సోనియా అగర్వాల్ ఓవర్ నైట్ లో పాపులర్ అయిన సంగతి తెలిసిందే.


సోనియా అగర్వాల్ రెండో పెళ్లికి సంబంధించి గతంలో ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి.


ప్రముఖ సింగర్ తో సోనియా అగర్వాల్ పెళ్లి జరగనుందని వైరల్ అయిన వార్తలు ఫ్యాన్స్ ను సైతం హర్ట్ చేశాయి.
తెలుగుతో పాటు ఇతర భాషల్లోని సినిమాలలో నటించిన సోనియా అగర్వాల్ తాజాగా రెండో పెళ్లి గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
ప్రస్తుతం సోనియా అగర్వాల్ ఫాల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.సరైన సమయం వస్తే రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమేనని ఆమె చెప్పుకొచ్చారు.
మీ అందరిలా నన్ను రెండో పెళ్లి చేసుకునే వ్యక్తి కొరకు నేను కూడా ఎదురుచూస్తున్నానని ఆమె చెప్పుకొచ్చారు.
ఇంకెన్ని రోజులు పెళ్లి చేసుకోకుండా ఈ విధంగా ఉంటానో నాకు కూడా తెలియదని ఆమె కామెంట్లు చేయడం గమనార్హం.
"""/" /
ఫాల్ వెబ్ సిరీస్ లో తాను ఇల్లాలి పాత్రలో కనిపిస్తున్నానని ఆమె చెప్పుకొచ్చారు.
ఈ సిరీస్ లో ఒక బిడ్డకు తల్లిగా కనిపిస్తున్నానని ఈ వెబ్ సిరీస్ లో నటించడం నాకు ఎంతగానో సంతోషం కలిగించిందని సోనియా అగర్వాల్ కామెంట్లు చేయడం గమనార్హం.
సోనియా అగర్వాల్ రెండో పెళ్లి తనకు ఇష్టమేనని చెప్పిన నేపథ్యంలో ఆమెను పెళ్లి చేసుకునే లక్కీ ఛాన్స్ ను పొందే వ్యక్తి ఎవరో చూడాల్సి ఉంది.
"""/" /
సోనియా అగర్వాల్ మొదటి భర్త సెల్వ రాఘవన్ కాగా కొన్ని కారణాల వల్ల సోనియా సెల్వ రాఘవన్ తో విడిపోయారు.
విడాకులు తీసుకున్న తర్వాత సింగిల్ గానే ఆమె జీవితాన్ని కొనసాగిస్తున్నారు.ఇప్పటికీ ఆమె వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు.
సోనియా అగర్వాల్ చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి 1, శనివారం 2025