లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియా పోటీ.. పీఏసీ భేటీలో తీర్మానం
TeluguStop.com
హైదరాబాద్ లోని గాంధీభవన్ లో జరిగిన కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
స్థానిక సంస్థలు, పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పీఏసీ సమావేశంలో నేతలు చర్చించారు.
ఇందులో భాగంగా వచ్చే వారం మరోసారి పీఏసీ భేటీ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
అలాగే ఈ సమావేశంలో మొత్తం మూడు తీర్మానాలకు ఆమోదం తెలిపారు.లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని నేతలు తీర్మానం చేశారు.
గ్రామసభలు పెట్టి అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇవ్వాలని, దాంతో పాటు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని తీర్మానం చేశారు.
ఈనెల 28 నుంచి దాదాపు 15 రోజులపాటు గ్రామసభలు నిర్వహిస్తామని ఆ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ తెలిపారు.
అలాగే తెలంగాణ నుంచి సోనియా పోటీ చేయాలని ఖర్గేకు లేఖ రాస్తామన్నారు.నాగ్ పూర్ సభకు రాష్ట్రం నుంచి యాభై వేల మంది హాజరు కావాలని నిర్ణయించారు.
అదేవిధంగా త్వరలోనే నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియను కూడా ప్రారంభిస్తామని తెలిపారు.
ఆ భాషలో ఎప్పటికీ సినిమాలు చెయ్యను… అల్లు అర్జున్ సంచలన వ్యాఖ్యలు!