సీనియ‌ర్ల‌ను దారిలో పెడుతున్న సోనియా ! వారు త‌గ్గిన‌ట్టేనా ?

ఉత్త‌రాది ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ దారుణ ప‌రాజ‌యం పొందింది.దీనికి గ‌ల కార‌ణాల‌ను అన్వేషించి లోపాల‌ను స‌రిదిద్దుకునే కార్యక్ర‌మాల‌కు సోనియాగాంధీ న‌డుంబిగించారు.

2024లో జ‌రిగే సార్వ్ర‌తిక ఎన్నిక‌ల నాటికి పార్టీని బ‌లోపేతం చేసే ల‌క్ష్యంతో ప‌నిచేస్తున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు కాంగ్రెస్ అధిష్టానంలో మార్పులు రావాల‌ని, నాయ‌క‌త్వం మారాల‌ని,పార్టీ సంస్థాగ‌తంగా మార్పులు రావాల‌ని ఒత్తిడి తెస్తున్న పార్టీ సీనియ‌ర్ నేత‌ల‌ను వెన‌క్కి త‌గ్గేలా చేస్తున్నారా ? అంటే అవున‌నే స‌మాధానాలు వ‌స్తున్నాయి.

జీ-23 బృందంగా ఏర్పాటైన సీనియ‌ర్ నేత‌లు కాంగ్రెస్ అధిష్టానం పై తొలి నుంచి అసంతృప్తిలో ఉన్నారు.

ఇటీవ‌ల ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యం త‌రువాత సీనియ‌ర్లు అధిష్టానంపై మండిప‌డ్డారు.పార్టీలో మార్పులు రావాల్సిందేనంటూ తెగేసి చెప్పారు.

సీడ‌బ్ల్యూసీ స‌మావేశానికి ముందే సీనియ‌ర్ నేత‌లు గులాంన‌బీ ఆజాద్ ఇంటిలో భేటీ కావ‌డం చ‌ర్చ‌కు దారితీస్తోంది.

ఈ స‌మావేశానికి సోనియా, రాహుల్, ప్రియాంక‌గాంధీ, త‌దిత‌ర నేత‌లు పాల్గొన‌గా వాడీవేడీగా జ‌రిగింద‌ట.

పార్టీకి శాశ్వ‌త అధ్య‌క్షుడిని ఎన్నుకోవాల‌ని సీనియ‌ర్ నేత‌లు డిమాండ్ చేశార‌ట‌.ఆ నేత‌లే ప్ర‌స్తుతం వెన‌క్కి త‌గ్గిన‌ట్టు క‌నిపిస్తోంది.

అయితే నేత‌లు రాహుల్‌గాంధీ, సోనియాగాంధీతో వేరువేరుగా స‌మావేశ‌మ‌య్యారు.తొలుత రాహుల్‌గాంధీతో హ‌రియాణా మాజీ ఎంపీ భూపీంద‌ర్‌సింగ్ భేటీ కాగా, మ‌రుస‌టి రోజు సోనియాగాంధృతో ఆజాద్ భేటీ అయ్యార‌ట‌.

భేటీల అనంత‌రం ఇరువురు సీనియ‌ర్‌నేత‌లు మాట్లాడుతూ.తాము నాయ‌క‌త్వ మార్పును ప‌ట్టుబ‌ట్ట‌లేద‌ని, పార్టీ బ‌లోపేతానికి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని చెప్పామ‌న‌డం గ‌మ‌నార్హం.

"""/"/ అయితే పార్టీ బాధ్య‌త‌ల నుంచి గాంధీ కుటుంబ స‌భ్యులు త‌ప్పుకోవాల‌ని ఇత‌రుల‌కు పార్టీ ప‌గ్గాలు ఇవ్వాల‌ని జీ-23లో భాగ‌మైన క‌పిల్ సిబ‌ల్ డిమాండ్ చేసిన విష‌యం విధిత‌మే.

కాగా, సోనియాతో భేటీ అనంత‌రం నాటి వ్యాఖ్య‌ల‌కు విరుద్ధంగా మాట్లాడ‌డం చ‌ర్చ‌కు దారితీస్తోంది.

మొత్తంగా నాయ‌క‌త్వ మార్పుపై ఊహాగానాల‌ను కొట్టిపారేశారు.ఇక అసంతృప్తి నేత‌ల‌ను దారికి తెచ్చుకునే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నార‌ని టాక్‌.

ఇందులో భాగంగానే ఆజాద్‌తో స‌మావేశ‌మైన‌ట్టు రాజకీయ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.