బిజెపి పై సీరియస్ వ్యాఖ్యలు చేసిన సోనియా గాంధీ..!!

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తాజాగా వర్చువల్ విధానం ద్వారా విపక్ష పార్టీలతో సమావేశమయ్యారు.

ఇటీవల వర్షాకాల పార్లమెంట్ సమావేశాలను ఉద్దేశించి.కేంద్ర అధికార పార్టీ బిజెపి పై సోనియా గాంధీ సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

ముఖ్యంగా దేశాన్ని కుదిపేసిన పెగసాస్ పై చర్చించాలనే ఆలోచన బీజేపీకి లేదని అన్నారు.

బిజెపి వైఖరి వల్ల పార్లమెంట్ సమయం వృధా అయిందని స్పష్టం చేశారు.పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో విపక్షాలు మొత్తం ఐక్యంగా పోరాడాయి అని కొనియాడారు.

ఇదే క్రమంలో పార్లమెంట్ వెలుపల కూడా విపక్షాలు అన్నీ కలిసి రాజకీయంగా పోరాటం చేయాలని సోనియాగాంధీ సమావేశంలో పిలుపునిచ్చారు.

మరి ముఖ్యంగా వచ్చే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి ని ఎలా ఎదుర్కోవాలి అనేదానిపై కూడా సోనియాగాంధీ చర్చించారు.

అంతేకాకుండా రైతు చట్టాలు అదేరీతిలో కరోనా వైరస్ వంటి విషయాలపై కూడా ఈ సమావేశంలో సోనియాగాంధీ విపక్ష పార్టీలతో చర్చించటం జరిగింది.

ఇది కేవలం మంచు వారి కన్నప్ప మాత్రమే.. ఎవరు రాసిన చరిత్ర… ఎక్కడ దొరికిన చరిత్ర ?