ప్రణబ్ కుమార్తెకు లేఖ రాసిన సోనియా!సోనియా వల్లనే ప్రణబ్ ప్రధాని కాలేకపోయారా?
TeluguStop.com
రాజ్యాంగంలోని ప్రతి అంశంపై పట్టు ఉన్న ప్రణబ్ ముఖర్జీ దేశ ప్రధాని కావాల్సి ఉంది.
కానీ కాంగ్రెస్ లో ఉన్న కుటుంబ రాజకీయాల వల్ల సోనియా గాంధీ ఆయనను రాష్ట్రపతిని చేసి పార్టీ వ్యవహారాలకు దూరం చేశారు.
ఒకవేళ షాడో మినిస్టర్ మన్మోహన్ సింగ్ బదులు ప్రణబ్ ముఖర్జీ గానీ ప్రధాని అయి ఉంటే ఈనాడు మోడీ చేస్తున్న సంస్కరణలలో సగం పైన ఆనాడే మొదలయ్యేవి.
అంతేకాకుండా కాంగ్రెస్ ఈరోజు బలమైన స్థానంలో నిల్చేది.కానీ అలా పార్టీ తమ కనుసన్నలలో కాకుండా వేరేవారి ప్రభావంతో ఎదగడం ఏమాత్రం గాంధీల కుటుంబానికి ఇష్టం లేదు అందుకే ఆయనను పక్కన పెట్టారు.
ఇక తాజాగా ప్రణబ్ ముఖర్జీ తన తుది శ్వాస విడిచారు.దీనిపై ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
అందులో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రణబ్ కుమార్తె శర్మిష్ఠకు ఓ లేఖ రాశారు.
అందులో ఐదు దశాబ్దాల పాటు జాతీయ స్థాయిలో తన మార్క్ సేవలను ప్రజలకు అందించి ప్రజల మనసులలో తనదైన ముద్ర వేసుకున్నారని అలాంటి ప్రణబ్ కొద్దిరోజులుగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయన ఇలా అర్ధాంతరంగా మన అందరినీ విడిచి వెళ్లిపోవడం దేశానికి పార్టీకి తీరని లోటని ఆయన లేని మేము ముందుకు ఎలా సాగాలో తెలియడం లేదని సోనియా ఆ లేఖలో పేర్కొన్నారు.
తిరుమలలో గుండు కొట్టించుకోవాలంటే రూ.100 చెల్లించాల్సిందేనా? వీడియో వైరల్