సోనియా గాంధీకి స్వల్ప అస్వస్థత..!

కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, పార్లమెంటరీ పార్టీ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ స్వల్ప అస్వస్థతతకు గురయ్యారని తెలుస్తోంది.

ఈ మేరకు ఆమెను ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

స్వల్ప జ్వరంతో సోనియాగాంధీ బాధ పడుతున్నారని, ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

కాగా ఈ సంవత్సరంలో సోనియా ఇప్పటికే రెండుసార్లు ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే.

ఆగస్ట్ 31న ముంబైలో నిర్వహించిన ఇండియా కూటమి సమావేశంలో పాల్గొన్న ఆమె అంతలోనే అస్వస్థతకు గురికావడంతో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నారని తెలుస్తోంది.

గేమ్ ఛేంజర్ రెండు రోజుల కలెక్షన్ల లెక్కలివే.. రెండో రోజు ఎంత వచ్చాయంటే?