తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ముఖ్యఅతిథిగా సోనియాగాంధీ..సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!!
TeluguStop.com
తెలంగాణ ఆవిర్భావ వేడుకలను( Telangana Formation Day ) కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది.
ఈ క్రమంలో జూన్ 2న జరిగే ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా సోనియాగాంధీని( Sonia Gandhi ) ఆహ్వానించినట్లు రేవంత్ రెడ్డి( Revanth Reddy ) ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన వారందరినీ దశాబ్ది వేడుకలకు అధికారికంగా ఆహ్వానిస్తున్నామని స్పష్టం చేశారు.
ఈ వేడుకలకు రానున్న సోనియాకు పిసిసి అధ్యక్షుడిగా సీఎంగా ధన్యవాదాలు చెబుతున్నానన్నారు.రాష్ట్రంలోని ప్రముఖులను ఉద్యమకారులను ఈ వేడుకలలో భాగస్వామ్యం చేస్తామన్నారు.
ప్రజా పాలనలో జరుపుకుంటున్న మొదటి ఉత్సవాలు కాబట్టి ఉద్యమకారులను భాగస్వాములను చేస్తామని తెలిపారు.
వారందరికీ సముచిత గౌరవం దక్కుతుందని హామీ ఇచ్చారు. """/" /
కోదండరాం నేతృత్వంలో జాబితాను తయారు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రజల అదృష్టం మేరకు సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఇచ్చారన్నారు.తెలంగాణ( Telangana ) ఇచ్చిన నేతగా సోనియాను ఆహ్వానించినట్లు చెప్పారు.
సోనియా రాక కోసం కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాయన్నారు.తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుక.
ప్రజలకు పండుగ రోజు అన్నారు.ఎన్నికలు వచ్చినప్పుడు ప్రధాని మోదీకి( PM Modi ) పాకిస్తాన్ గుర్తు వస్తుందని విమర్శించారు.
మరి అలాంటప్పుడు పాకిస్తాన్ ప్రధాని పుట్టినరోజు వేడుకలకు మోదీ పాక్ కి ఎందుకు వెళ్లారు.
? పాక్ ప్రధానిని.ఎందుకు కౌగిలించుకున్నారు.
? అంటూ ప్రశ్నించారు.ధరల పెరుగుదల, రిజర్వేషన్లు రద్దు చేయడం, రాజ్యాంగాన్ని మార్చటం అంశాలను లేవనెత్తితే బీజేపీకి పాకిస్తాన్ గుర్తుకు వస్తుందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
ఎన్టీయార్ పాన్ ఇండియా డైరెక్టర్లనే ఎంచుకుంటున్నాడా..? కారణం ఏంటి..?