Sonia Agarwal Selvaraghavan : మాజీ భర్తతో పని చేయడం నాకు ఇష్టమే.. సోనియా అగర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్!

హీరోయిన్ సోనియా అగర్వాల్‌( Sonia Agarwal ) గురించి మనందరికి తెలిసిందే.సోనియా అగర్వాల్ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా 7/జీ బృందావనం కాలనీ.

( 7/G Brindavan Colony ) ఈ సినిమాతో భారీగా పాపులరీటిని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.

అయితే ఈ సినిమా కంటే ముందు తర్వాత పలు సినిమాలలో నటించినప్పటికీ ఈ మూవీతో భారీగా పాపులరీటిని సంపాదించుకుంది.

ధనుష్‌ సరసన కాదల్‌ కొండేన్‌, పుదుపేటఐఅట, రవికృష్ణకు జంటగా 7/జీ బృందావన్‌ కాలనీ వంటి విజయవంతమైన చిత్రాల్లో కథానాయికిగా నటించారు.

ఈ మూడు చిత్రాలకు దర్శకుడు సెల్వరాఘవనే( Director Selvaraghavan ) అన్న విషయం తెలిసిందే.

ఆ సమయంలో సెల్వరాఘవన్‌, నటి సోనియా అగర్వాల్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.కానీ వీరి వివాహ బంధం ఎక్కువ కాలం సాగలేదు.

విభేదాలు రావడంతో ఇద్దరు విడిపోయారు.ఆ తరువాత ఎవరి వృత్తిని వారు కొనసాగిస్తున్నారు.

అయితే ఆ తరువాత ఈ ఇద్దరిలో ఎవరికీ సరైన హిట్స్‌ లేకపోవడం గమనార్హం.

కాగా ఇటీవల నటుడిగానూ అవతారం ఎత్తిన సెల్వరాఘవన్‌ తాజాగా ఆ వృత్తికి ఫుల్‌స్టాప్‌ పెట్టి మళ్లీ దర్శకత్వంపై దృష్టి పెట్టారు.

"""/" / తను ఆదిలో తెరకెక్కించి సంచలన విజయాన్ని కొట్టిన 7/జీ బృందావన్‌ కాలనీ చిత్రానికి సీక్వెల్‌( 7/G Brindavan Colony Sequel ) తీయనున్నారు.

ఈ చిత్రం నిర్మాణ దశలో ఉంది.కాగా ఆయన ఇంతకు ముందు దర్శకత్వం వహించిన మరో సూపర్‌ హిట్‌ పుదుపేట్టై( Pudhupettai ) చిత్రానికి సీక్వెల్‌ చేస్తానని ప్రకటించారు.

అదీ ఈ ఏడాదిలోనే మొదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.కాగా పుదుపేట్టై చిత్రంలో ధనుష్‌( Dhanush ) సరసన నటి సోనియా అగర్వాల్‌, స్నేహా నటించారు.

దీంతో పుదుపేట్టై– 2 చిత్రంలో మీరు నటిస్తారా? అన్న ప్రశ్నకు నటి సోనియా అగర్వాల్‌ ఒక ఇంటర్వ్యూలో స్పందిస్తూ.

"""/" / సెల్వరాఘవన్‌ తో కలిసి పని చేయడానికి నాకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు.

నటన నా వృత్తి అని తెలిపింది సోనియా అగర్వాల్.పుదుపేట్టై 2( Pudhupettai-2 ) చిత్రంలో నటించడం తనకు ఇష్టమేనని అన్నారు.

అయితే ఆ చిత్రంలో నటించే విషయమై తనను ఎవరూ సంప్రదించలేదని స్పష్టం చేశారు.

అసలు ఆ చిత్రంలో ఎవరెవరు నటిస్తున్నారో కూడా తెలియదని నటి సోనియా అగర్వాల్‌ పేర్కొన్నారు.

కాగా ఈ సందర్బంగా ఆమె చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .