బే ఏరియాలో టాటా...“ఆటా పాట”..!!!

అమెరికాలో తెలంగాణా అమెరికా తెలుగు సంఘం అయిన టాటా గురించి తెలియని వారు ఉండరు.

భారతీయ సంప్రదాయంగా వచ్చే ప్రతీ పండుగని ఎంతో చక్కగా అందరూ ఒక్కచోట చేరి నిర్వహించుకుంటారు.

అదేవిధంగా టాటా తాజాగా హోళీ 2019 సంబరాలని సైతం ఎంతో ఘనంగా నిర్వహించింది.

గడిచిన మూడేళ్ళుగా టాటా బే ఏరియా చాప్టర్‌ టాటా యువ టీం ఈ హోళీ వేడుకలను నిర్వహిస్తోంది.

ఫ్రీమాంట్‌లోని ఎలిజబెత్‌ పార్క్‌లో జరిగిన ఈ వేడుకలకు దాదాపు 2500 మందికి పైగా హాజరయ్యారు.

హాజరైన వారిలో భారత సంతతికి చెందిన అమెరికా పౌరసత్వం కలిగిన వారు, ఎన్నారైలు, విద్యార్ధులు పెద్ద సంఖ్యలో ఉన్నారు.

మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ఈ వేడుకులకి స్థానిక అమెరికన్స్ కూడా రావడం, భారతీయ ఎన్నారైలతో కలిసి పాల్గొనడం ఈ కార్యక్రమానికి మరింత ఊపు ఇచ్చింది.

అయితే ఈ వేడుకల కోసం స్థానికంగా ఉన్న ఏరోడ్యాన్స్‌ వారి నత్య ప్రదర్శనలు, క్రియా డ్యాన్స్‌ అకాడమీ మరియు డీజే అర్జవ్‌ గోస్వామి బృందం మ్యూజిక్ తో అందరూ ఆ సంగీతానికి తగ్గట్టుగా నృత్యం చేశారు.

తండేల్ విషయంలో భారీ రిస్క్ తీసుకున్న నిర్మాతలు.. చైతన్య సాయిపల్లవి ఏం చేస్తారో?