స్టార్ హీరోయిన్ ని హడలెత్తేంచిన ఉబెర్ డ్రైవర్.... 

ప్రముఖ బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ తాజాగా లండన్ లో వింత అనుభవాన్ని ఎదుర్కొంది.

దీంతో ఈ విషయాన్ని తన అభిమానులతో పంచుకుంది.ఇందులోభాగంగా సోనమ్ కపూర్ ప్రస్తుతం తన భర్తతో పాటు లండన్ లో ఉంటున్నానని, తాజాగా పని నిమిత్తం బయటికి వెళ్లాల్సి రావడంతో  ఉబర్ క్యాబ్ ని బుక్ చేసుకున్నానని అన్నారు.

అయితే  ఉబర్ క్యాబ్ డ్రైవర్ ప్రవర్తన తనకు నచ్చలేదని మరియు అతడు తనతో చాలా వింతగా ప్రవర్తించాడని దీంతో ఎప్పుడెప్పుడు తన గమ్యస్థానం వస్తుందా అని దీనంగా ఎదురు చూసినట్లు చెబుతోంది ఈ అమ్మడు.

అయితే ఈ విషయాన్ని సోనం కపూర్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది.

అంతేగాక లండన్ లో ప్రయాణించేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలని, అంతేగాక ముఖ్యంగా ఒంటరిగా ప్రయాణించే సమయాల్లో పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వ్యవస్థని ఉపయోగించాలని సూచించారు.

అయితే ఈ విషయంపై సూపర్ సంస్థ అధికారులు స్పందించారు.ఇందులో భాగంగా సోనం కపూర్ కి క్షమాపణలు చెప్పారు.

 అంతేగాక డ్రైవర్ యొక్క ఐడి మరియు బుకింగ్ వివరాలు ఇవ్వాలని అతడి పై చర్యలు తీసుకుంటామని కోరారు.

"""/"/అయితే సోనం కపూర్ మాత్రం తాను అప్పటికే ఫిర్యాదు కూడా చేశానని కానీ అవన్నీ డిస్కనెక్ట్ అయిపోయాయని  అన్నారు.

అంతేగాక జరగాల్సిందంతా అప్పుడే జరిగిపోయిందని ఇంక మీరు ఇప్పుడు చేసేది ఏమీ లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే సోనం కపూర్ ఇలా చేదు అనుభవాలు ఎదుర్కొనడం ఇదే మొదటిసారి కాదు ఇది రెండోసారి.

ఇంతకు ముందు బ్రిటిష్ ఎయిర్ లైన్స్ లో ప్రయాణిస్తున్న సమయంలో తన మూడు లగేజ్ బ్యాగులు మిస్ అయ్యాయి.

దీంతో ఈ అమ్మడు ఈ విషయాన్ని గుర్తుచేసుకుంటూ మరింత ఆగ్రహం వ్యక్తం చేసింది.

 .

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ఇల్లు చూశారా.. ఇంత సింపుల్ గా ఉండటం డార్లింగ్ కే సాధ్యమా?