అయ్యో రామా : వీడియో పెట్టినందుకు స్టార్ హీరోయిన్ ని అరెస్ట్ చెయ్యాలంట..!

ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలు అందరికీ అందుబాటులోకి రావడంతో సెలబ్రిటీలకు మరియు అభిమానులకు మధ్య దూరం బాగా తగ్గిపోయింది.

దీంతో కొంత మంది సెలబ్రెటీలు ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేస్తుండడంతో కొంతమంది అభిమానులు నిజా నిజాలు తెలుసుకోకుండా వారిపై ఘాటు విమర్శలు చేస్తున్నారు.

తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఆహుజా కూడా ఇలాంటి విమర్శలే సోషియల్ మీడియాలో ఎదుర్కొంది.

వివరాల్లోకి వెళితే ప్రస్తుతం సోనమ్ కపూర్ అహుజా తన భర్తతో కలిసి లండన్లో నివాసం ఉంటోంది.

అయితే ఈ మధ్య సోనమ్ కపూర్ తన గార్డెన్ లో తీసుకున్నటువంటి ఓ వీడియోని తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసింది.

దీంతో కొంత మంది నెటిజన్లు సోనమ్ కపూర్ షేర్ చేసిన ఈ వీడియో పై పలు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు.

అంతేగాక ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా పరిస్థితులను లెక్క చేయకుండా పార్కులలో తిరగడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

మరికొందరైతే అత్యుత్సాహం ప్రదర్శిస్తూ కరోనా వైరస్ కారణంగా విధించినటువంటి లాక్ డౌన్ ని పాటించకుండా విచ్చలవిడిగా తిరుగుతున్న స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ ని అరెస్టు చేయాలంటూ కామెంట్లు చేస్తున్నారు.

దీంతో తాజాగా సోనమ్ కపూర్ ఈ విషయంపై స్పందించింది.ఇందులో భాగంగా తానేమి లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించ లేదని, తాను వీడియో తీసుకున్నటువంటి ప్రదేశం తన ఇంటి గార్డెన్ అని వివరణ ఇచ్చింది.

అంతేగాక ఈమధ్య నిజా నిజాలు ఏమిటో తెలుసుకోకుండా సోషల్ మీడియా మాధ్యమాలలో సెలబ్రిటీలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేసింది.

 .

సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఖాతాలో మరో క్రేజీ రికార్డ్.. ఏం జరిగిందంటే?