ఇండస్ట్రీలో సెలబ్రెటీలపై రూమర్స్ పుట్టించేది వాళ్లే: సోనాలి బింద్రే

సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్గా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి సోనాలి బింద్రే( Sonali Bindre) ఒకరు.

ఈమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు.బాలీవుడ్ చిత్రంతో ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి సోనాలి బింద్రే తెలుగులో మాత్రం మహేష్ బాబు( Mahesh Babu ) హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన మురారి ( Murari ) సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.

ఈ సినిమా ద్వారా మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె అనంతరం తెలుగులో కూడా వరుస సినిమా అవకాశాలను అందుకున్నారు.

"""/" / ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోలు అందరి సరసన నటించి ప్రేక్షకులను మెప్పించినటువంటి ఈమె అనంతరం పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమయ్యారు.

అయితే పెళ్లి తర్వాత సోనాలి బింద్రే భయంకరమైనటువంటి క్యాన్సర్ వ్యాధి బారిన పడ్డారు.

ఈ వ్యాధి కోసం ట్రీట్మెంట్ చేయించుకుంటూ కొంతకాలంగా అమెరికాలోనే ఉన్నటువంటి ఈమె ఈ వ్యాధితో పోరాడి చివరికి మామూలు మనిషిగా తిరిగి వెనక్కి వచ్చారు.

ఇలా తన ఆరోగ్యం కూడా కుదుటపడటంతో ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.

"""/" / ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా ఈమె పలు వెబ్ సిరీస్లలో నటించడమే కాకుండా పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీల గురించి వచ్చే రూమర్లపై కామెంట్లు చేశారు.

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరో హీరోయిన్ల మధ్య ఏదో రిలేషన్ ఉందంటూ వార్తలు వస్తూ ఉంటాయి.

అయితే ఇలాంటి వార్తలు ఎలా వస్తాయో నాకు కెరియర్ మొదట్లో అర్థమయ్యేది కాదని ఈమె తెలిపారు.

అయితే హీరో హీరోయిన్ల మధ్య ఇలాంటి రూమర్లను పుట్టించేది నిర్మాతలేనని ఈమె సంచలన వ్యాఖ్యలు చేశారు.

వారి సినిమా ప్రమోషన్ల కోసం ఇలాంటి వార్తలను స్ప్రెడ్ చేయించేవారు అంటూ ఈ సందర్భంగా సోనాలి బింద్రే చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

పాన్ ఇండియా సక్సెస్ కొట్టడానికి ట్రై చేస్తున్న స్టార్ డైరెక్టర్…