చివరకు సోనాల్ కూడా బాలయ్యకు నో చెప్పింది…
TeluguStop.com
నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న మోనార్క్ సినిమా షూటింగ్ మార్చి నుండి ఇప్పటి వరకు ఆగిపోయింది.
కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమాను మళ్లీ ఎప్పుడు మొదలు పెట్టే విషయమై క్లారిటీ లేదు.
భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటించబోతున్నారు అనే వార్తలు చాలా కాలంగా జోరుగా వినిపిస్తున్నాయి.
మొన్నటి వరకు పూర్ణ ఒక హీరోయిన్ గా ఎంపిక అయ్యిందని.మరో హీరోయిన్ పాత్ర కోసం ప్రగ్యా జైస్వాల్ ను సంప్రదిస్తున్నట్లుగా ప్రచారం జరిగింది.
అయితే ప్రగ్యా జైస్వాల్ సినిమాలో నటించేందుకు నో చెప్పిందనే వార్తలు వస్తున్నాయి.బాలయ్యతో నటించేందుకు నో చెప్పిందనే వార్తల నేపథ్యంలో ఆమె గురించి మీడిఆయలో చర్చనీయాంశం అయ్యింది.
ఇప్పుడు బాలయ్యతో నటించేందుకు సోనాల్ చౌహాన్ కూడా నో చెప్పిందనే ప్రచారం జోరుగా సాగుతోంది.
"""/"/
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం దర్శకుడు బోయపాటి శ్రీను ఇటీవల సెకండ్ హీరోయిన్ పాత్ర కోసం సోనాల్ చౌహాన్ ను సంప్రదించారట.
ఇప్పటికే మూడు సినిమాలు బాలయ్యతో నటించిన సోనాల్ నాల్గవ సారి నటించేందుకు నో చెప్పిందట.
ఈ విషయంలో చాలా సార్లు ఆమె తో చర్చించేందుకు ప్రయత్నించినా కూడా నో అంటూనే సమాధానం ఇచ్చిందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
ఇప్పటికే బాలకృష్ణ తో లెజెండ్.డిక్టేటర్.
రూలర్ సినిమాల్లో సోనాల్ చౌహాన్ నటించింది.ఆ సినిమాల్లో లెజెండ్ హిట్ అయినా కూడా ఆ హిట్ ఆమెకు ఏమాత్రం ఉపయోగపడలేదు.
ఆ తర్వాత నటించిన ఏ సినిమాలు కూడా బ్రేక్ ఈవెన్ అవ్వలేదు.దాంతో ఆమెకు మళ్లీ బాలయ్యతో నటించాలనే ఆసక్తి లేనట్లుగా తెలుస్తోంది.
అవకాశాలు లేని సోనాల్ చౌహాన్ జోక్ గా బాలయ్య ఆఫర్ వద్దనడం ఏంటో అంటూ నందమూరి అభిమానులు సోనాల్ ను ట్రోల్ చేస్తున్నారు.
హెచ్ఎంపీవీ వైరస్ పాతదేనా..ఈ వైరస్ గురించి శాస్త్రవేత్తలు చెబుతున్న విషయాలివే!