నా పెళ్లి రెండు చోట్ల జరగాలి.. హీరోయిన్ కామెంట్స్ వైరల్..!
TeluguStop.com
బాలీవుడ్, టాలీవుడ్ సినిమాల్లో నటించి నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు సోనాల్ చౌహాన్.
రెయిన్ బో సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన సోనాల్ చౌహాన్ బాలకృష్ణకు జోడీగా లెజెండ్, డిక్టేటర్ సినిమాల్లో నటించారు.
లెజెండ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టైనా సోనాల్ కెరీర్ మాత్రం పుంజుకోలేదు.అందం, అభినయం పుష్కలంగా ఉన్నా అదృష్టం లేకపోవడంతో సోనాల్ స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది.
అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సోనాల్ బికినీతో బీచ్ లలో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ఫాలోవర్లను మాత్రం భారీగా పెంచుకుంటున్నారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాల్ చౌహాన్ కు పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు ఎదురు కాగా ఆమె పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తనకు ప్రకృతి అంటే చాలా ఇష్టమని కొండ ప్రాంతంలో లేదా సాగరతీరంలో పెళ్లి జరిగితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
"""/"/
ప్రకృతికి మించిన అందం మరొకటి ఉండదని ఆమె పేర్కొన్నారు.అయితే నచ్చిన వ్యక్తి మాత్రం ఇప్పటివరకు ఎవరూ తనకు తారసపడలేదని ఆమె వెల్లడించారు.
సాధ్యమైతే కొండ ప్రాంతంతో పాటు సాగర తీరం వేదికగా కూడా రెండు చోట్ల పెళ్లి చేసుకోవాలని ఉందని సోనాల్ చౌహాన్ అన్నారు.
పెళ్లి గురించి సోనాల్ చౌహాన్ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.మరి సోనాల్ నచ్చిన విధంగా పెళ్లి చేసుకుంటారో లేక మరో విధంగా పెళ్లి చేసుకుంటారో చూడాల్సి ఉంది.
మరోవైపు సోనాల్ చౌహాన్ చేతిలో పెద్దగా ఆఫర్లు లేవు.2020 సంవత్సరం సోనాల్ చౌహాన్ కు పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి.
కొత్త ఏడాది అయినా సోనాల్ చౌహాన్ కు కలిసొస్తుందో లేదో చూడాల్సి ఉంది.
బాలకృష్ణ మినహా మరే స్టార్ హీరో సోనాల్ కు ఛాన్సులు ఇవ్వకపోవడం గమనార్హం.
మోహన్ బాబు ఫ్యామిలీ లో గొడవలు ఇప్పుడప్పుడే తగ్గేలా లేవా..?