రూ.40 వేల కోట్ల సంపదను వదులుకుని భిక్షాటన చేస్తున్న బిలియనీర్ కొడుకు

ఒక ధనవంతుడి కుమారుడు తన తండ్రి ఆస్తి మొత్తాన్ని వదిలేసుకుని భౌద్ద సన్యాసిగా మారాడు.

ఏకంగా రూ.40 వేల కోట్లను తృణప్రాయంగా వదిలిపెట్టుకుని సన్యాసిగా మారి భిక్షాటన చేస్తూ బతుకుతున్నాడు.

ఇతడి గురించి ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది.ఇంతకు ఆయన ఎవరు? ఆయన కథ ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

"""/" / బిలియనర్ ఆనంద్ కృష్ణన్ ( Billionaire Anand Krishnan )కుమారుడు మాంక్ వెన్ అజాన్ సిరిపన్యో( Monk Wen Ajan Siripanyo ) గురించి ఇప్పుడు బాగా చర్చ జరుగుతోంది.

మలేషియా-తమిళ వ్యాపారవేత్త అయిన ఆనంద్ కృష్ణన్‌ను అందరూ ఏకే అని పిలుస్తారు.మలేషియాలోనే మూడో అత్యంత ధనవంతుడిగా ఆయన ఉన్నాడు.

మీడియా, టెలికాం, గ్యాస్, రియల్ ఎస్టేట్ లాంటి ఎన్నో వ్యాపారాలు చేశారు.అంతేకాకుండా 9 కంపెనీలలో ఆయనకు వాటాలు ఉన్నాయి.

గతంలో ఎయిర్‌సెల్ కంపెనీకి( Aircel Company ) యజమానిగా కూడా ఉన్నారు.

"""/" / ఆనంద్ కృష్ణన్‌కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు.అతడి కుమారుడే సిరిపన్యో.

18 సంవత్సరాలకే సిరిపన్యో బౌద్ధ సన్యాసిగా మారారు.సరదా కోసం సన్యాసం స్వీకరించిన ఆయన.

తర్వాత శాశ్వతంగా అలాగే ఉండిపోయారు.తండ్రి సంపాదించిన రూ.

కోట్ల సంపదను వదిలేసి సన్యాసిగా భిక్షాటన చేస్తూ జీవితం గడుపుతున్నారు.సిరిపన్యో తమిళం, ఇంగ్లీష్, థాయ్ తో పాటు 8 భాషలు మాట్లాడుతున్నారు.

ఆయన తల్లి థాయ్ రాజ కుటుంబానికి చెందినవారు.కొడుకు సన్యాసిగా మారడంపై కృష్ణన్ మాట్లాడుతూ.

తన దగ్గర కోట్ల రూపాయలు ఉన్నా.తన కొడుకుని పోషించే స్తోమత లేదని వ్యాఖ్యానిస్తున్నారు.

గతంలో తన తండ్రి 70వ జన్మదినం సందర్బంగా ఇటలీ నుంచి ఒక ప్రైవేట్ జెట్‌లో సిరిపన్యో వచ్చారు.

అంతకు తప్పితే ఆయనకు సంబంధించిన వివరాలు ఏమీ అందుబాటులో లేవు.రూ.

కోట్లు సొమ్ము వదిలేసి సన్యాసిగా మారడమంటే గ్రేట్ కదా.