ఇంట్లో తల్లి శవం.. గుళ్లో కొడుకు పెళ్లి.. ఏం జరిగిందో తెలుసా?

ఎదిగొచ్చిన కొడుకు మంచిగా స్థిరపడాలని ప్రతి తల్లీ కోరుకుంటుంది.దాంతో పాటు తనకు పుట్టబోయే పిల్లాపాపలతో ఆడుకోవాలని, మనవళ్లు, మనవరాళ్ల అల్లరితో శేష జీవితం గడిపేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.

కొంత మందికి ఈ కోరికలు నెరవేరితే.మరి కొందరికి మాత్రం అవేవీ తీరకుండానే కాలం చేస్తారు.

వృద్ధులు ఉన్నఇళ్లల్లో అయితే మనవడి పెళ్లి చూసి చని పోతామని ఎప్పుడు పోరు పెట్టడం చూస్తూనే ఉంటాం.

ఝార్ఖండ్ లో అలాంటిదే ఓ ఘటన జరిగింది.ఇప్పుడు ఆ న్యూస్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అసలేం జరిగిందంటే.తల్లి మృత దేహాన్ని ఇంట్లో ఉంచి కుమారుడు పెళ్లి చేసుకున్న ఘటన ఝార్ఖండ్ లో జరిగింది.

జూలై 10 న కొడుకు పెళ్లి జరగాల్సి ఉంది.తల్లి అనారోగ్యంతో చికిత్స పొందుతూ గురు వారమే ప్రాణాలు కోల్పోయింది.

మృతురాలి చివరి కోరిక తన కుమారుడి పెళ్లి చేయడమే.ఈ నేపథ్యంలో తల్లి ఆఖరి కోరికను తీర్చేందుకు కొడుకు సిద్ధమయ్యాడు.

శివాలయంలో సరోజ్ అనే యువతిని పెళ్లి చేసుకుని వచ్చాడు.చనిపోయిన తల్లి పాదాలు పట్టుకుని ఆశీర్వాదం తీసుకున్నారు నూతన వధూ వరులు.

ఈ ఘటన ధన్ బాద్ లోని కేందూ ఆడియా పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో జరిగింది.

ఈ విషయం తెలుసుకున్న  ప్రతీ ఒక్కరూ అతడిని అభినందిస్తున్నారు.అమ్మ చివరి కోరిక తీర్చేందుకు అతడను బాధను దిగమింగుకొని పెళ్లి చేసుకోవడం చాలా గొప్ప విషయమని అంటున్నారు.