ఓ కొడుకు తన తల్లిని అతి దారుణంగా.. ఇలాంటిది ఎక్కడ విని ఉండరు.. ?

ఎవరికి ఎవరు ఈ లోకంలో అన్నట్లుగా సాగుతుంది ఈ సమాజంలో మానవ బంధాల మధ్య సంబంధాలు.

కన్నవారు, కట్టుకున్న వారు, ఆదుకున్న వారు అనే బేధాలు ఏవి లేవు.ఇక్కడున్నది ఒక్కటే దొంగ దొరై తిరుగడం.

విచక్షణ రహితంగా ప్రవర్తించడం.మార్పు మంచికే కానీ భయం గొల్పి మరణించేలా చేసే మార్పు మానవాళికి ముప్పు అని అనిపిస్తుంది.

ఈ ఘటన తెలుసుకుంటే మీరుకూడా ఇలాంటి వ్యక్తులు సమాజంలో ఉంటారా అని ఆలోచిస్తారు.

ఇకపోతే జార్ఖండ్ లోని పశ్చిమ సింఘ్‌భూమ్ జిల్లాలో ఓ కొడుకు తన తల్లిని అతి దారుణంగా చంపేసి ఆమె చితిపై చికెన్ కాల్చుకు తిన్న ఉదంతం సంచలనంగా మారింది.

నామ్ వీర్ టోలా ప్రాంతానికి చెందిన ప్రధాన్ సోయ్ అనే 35 ఏళ్లు వ్యక్తి తాగుడుకు బానిసై తరచుగా ఇంట్లో గొడవ పడేవాడట.

ఈ క్రమంలో ఫూల్‌గా తాగివచ్చిన అతనికి 60 సంవత్సరాల వయస్సున్న అతని తల్లి సుమి సోయ్ అన్నం పెట్టేందుకు తల్లి నిరాకరించగా తీవ్రమైన కోపంతో ఊగిపోయిన ఆ కొడుకు కర్రతో తల్లిపై దాడి చేశాడట.

ఆ దాడిలో మరణించిన తల్లి మృతదేహన్ని ఇంటి పెరట్లో కట్టెలు పోగేసి తల్లిని తగులబెట్టి, ఆమె చితిపై కోడిని కాల్చుకొని తినేసి అక్కడే నిద్రపోయాడట.

ఇక ఆ యువకుని సోదరి ఈ దారుణాన్ని చూసి చుట్టుపక్కల వారికి చెప్పగా అందరూ కలిసి ప్రధాన్ ను పోలీసులకు అప్పగించారు.

ఇక సగం కాలిన తల్లి శవాన్ని అక్కడే పూర్తిగా కాల్చేశారట.కాగా నాలుగేళ్ల క్రితం తండ్రి హత్య కేసులో జైలుకు వెళ్లి వచ్చిన ఇతను తల్లి మరణానికి కూడా కారణం అయ్యాడు.

ఈ 4 చిట్కాలను పాటిస్తే మాత్రం టెన్షన్ ఫ్రీ లైఫ్ సొంతమట.. వెంకీమామ ఏం చెప్పారంటే?