వీడియో వైరల్: ఫోన్ ఇవ్వనందుకు తల్లిని బ్యాట్ తో చావబాదిన కొడుకు!

ప్రస్తుత రోజుల్లో చిన్న పిల్లవాడు నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్లకు( Smart Phone ) బాగా అడిక్ట్ అయిపోయారు.

ఈ క్రమంలో ఉదయం నిద్ర లేచిన సమయం నుండి రాత్రి వరకు చాలామంది మొబైల్ ఫోన్ లోనే వాళ్ల జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు.

ఇక ముఖ్యంగా చిన్నపిల్లలు అయితే, నిద్ర లేవగానే ఫోను పట్టుకొని యూట్యూబ్ లో షార్ట్స్, వీడియోస్ చూడడం, లేదా ఎప్పుడూ కూడా గేమ్స్ ఆడడం లాంటివి చూస్తూనే ఉంటున్నారు.

ఇలా మొబైల్ కు బానిసైన చాలామంది పిల్లలు అనారోగ్యపాలై చివరికి ఆసుపత్రి చుట్టూ తిరుగుతూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు.

"""/" / ఇకపోతే, ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ గా( Viral Video ) చక్కర్లు కొడుతుంది.

వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా.ఒక అబ్బాయి తన తల్లిని బ్యాట్( Bat ) తీసుకుని కొట్టిన సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

ఈ వీడియోలో ముందుగా ఆ పిల్లవాడు మొబైల్ ఫోన్ చూస్తూ ఉండడంతో అతడి తల్లి( Mother ) వచ్చి ఆ పిల్ల వాడిని మందలించి మొబైల్ లాక్కొని చదవాలి అంటూ తెలిపింది.

అనంతరం ఆ పిల్లవాడు పక్కనే ఉన్న పుస్తకాన్ని తీసుకొని చదవడం మొదలు పెట్టి.

, కాసేపు అనంతరం పిల్లవాడు ఎందుకో పక్కకు వెళ్లి తిరిగి వచ్చే సమయంలో బ్యాటు తీసుకుని ఒక్కసారిగా తల్లి తలపై కొట్టాడు.

"""/" / దీంతో ఆ మహిళ వెంటనే స్పృహ తప్పి పడిపోయింది.కానీ ఆ పిల్లవాడు అది ఏమీ పట్టించుకోకుండా తన తల్లి చేతిలో ఉండే మొబైల్ ను లాక్కొని మళ్లీ ఫోన్ చూడడం మొదలు పెట్టేసాడు.

ఇక ఈ వీడియోను చూసిన కొంతమంది నెటిజన్స్ ప్రస్తుత రోజులలో పిల్లలు ఇలాగే ఉన్నారు.

ఫ్యూచర్ లో పిల్లలు ఎలా తయారవుతారో అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..