తల్లిపై ప్రేమతో గుడి కట్టించి పాలరాతి విగ్రహం చేయించిన కొడుకు.. కొడుకు ప్రేమకు ఫిదా అంటూ?
TeluguStop.com
ప్రతి ఒక్కరి సక్సెస్ లో తల్లి పాత్ర కొంతమేర ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
కొడుకుకు ఏ కష్టం రాకుండా చూసుకునే విషయంలో తల్లి ముందువరసలో ఉంటారు.తమిళనాడు( Tamil Nadu ) రాష్ట్రానికి చెందిన ఒక యువకుడు తల్లిపై ప్రేమతో గుడి కట్టించడంతో పాటు తల్లి రూపంతో ఉన్న పాలరాతి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేశారు.
బ్రతికున్న తల్లి కోసం వెల్డింగ్ చేసే పనులు చేసే ఈ యువకుడు సంపాదించిన డబ్బును జాగ్రత్తగా పొదుపు చేసి గుడి కట్టించాడు.
తల్లిపై తనకు ఉన్న ప్రేమను ప్రపంచానికి తెలియజేయాలనే ఆలోచనతో యువకుడు ఈ విధంగా చేశాడని తెలుస్తోంది.
తమిళనాడులోని నమక్కల్( Namakkal ) లో నివశించే ప్రభు వయస్సు 30 సంవత్సరాలు కాగా తన తల్లికి గుడి కట్టించి తల్లినే దేవతలా ఆరాధిస్తున్నాడు.
తన తల్లికి గుడి కట్టించడం గురించి ప్రభు మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
"""/" /
చిన్నప్పుడు అమ్మ ఎంతగానో కష్టపడుతున్నా ఆ కష్టం విలువ నాకు ఎక్కువగా అర్థం అయ్యేది కాదని ప్రభు తెలిపారు.
తాను ఎప్పుడైతే పనిలో కుదిరానో అప్పుడే తల్లి కష్టం విలువ అర్థమైందని ప్రభు కామెంట్లు చేశారు.
అమ్మపై ప్రేమతో ఏదో ఒకటి చేయాలని భావించి గుడి కట్టానని ప్రభు చెప్పుకొచ్చారు.
20 సంవత్సరాల క్రితం నాన్న మృతి చెందారని అమ్మ మణి( Mani ) ఎంతో కష్టపడి పదో తరగతి వరకు చదివించిందని ప్రభు అన్నారు.
"""/" /
1500 చదరపు అడుగుల ఫ్లాట్ ను కొనుగోలు చేసి అమ్మ విగ్రహాన్ని 3 అడుగుల ఎత్తుతో తయారు చేయించామని ఆయన తెలిపారు.
విగ్రహాన్ని చూసి అమ్మ ఆనంద భాష్పాలు పెట్టుకున్నారని ప్రభు కామెంట్లు చేశారు.ప్రభు చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తల్లి విషయంలో ప్రభు ప్రేమకు ఫిదా అవుతున్నామంటూ నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.