విడ్డూరం : శోభనంకు ఆలస్యం చేస్తున్నాడని కన్న తండ్రిని కడతేర్చిన కొత్త పెళ్లికొడుకు

కొందరు యువకులు పెళ్లి వరకు ఆగుతారు కాని, పెళ్లి అయిన తర్వాత కనీసం ఒక్క రోజు కూడా శోభనంకు ఆగరు.

పెళ్లి అయిన వెంటనే శోభనం కావాల్సిందే అంటూ పట్టుబడుతూ ఉంటారు.అలాంటి సంఘటనలు ఎన్నో చూశాం.

కాని ఇప్పటి వరకు అవి చాలా వరకు సరదాగా సాగాయి.కాని ఈసారి మాత్రం విషాదాంతం అయ్యింది.

ఒక కొత్త పెళ్లి కొడుకు తండ్రి తన శోభనంకు ఆలస్యం చేస్తున్నాడని, అడ్డుపడుతున్నాడని భావించి ఏకంగా కర్రతో తలపై బాది చంపేశాడు.

తీరా అతడి శోభనం కాదు కదా కనీసం భార్య వద్దకు వెళ్లే పరిస్థితి కూడా లేకుండా పోయింది.

"""/"/ పూర్తి వివరాల్లోకి వెళ్తే.తమిళనాడు అరియలూరు జిల్లా జయంకొండ ప్రాంతంకు చెందిన 23 ఏళ్ల ఇళమదికి రెండు రోజుల క్రితం పెళ్లి అయ్యింది.

పెళ్లి అయిన రోజే కుటుంబ సభ్యులు ఫస్ట్‌ నైట్‌కు ఏర్పాటు చేశారు.శోభనంకు మొత్తం సిద్దం అయ్యింది.

రూంను అంతా అలంకరించి అమ్మాయిని లోనికి పంపించారు.ఇక ఇళమది కూడా లోనికి వెళ్లాల్సి ఉంది.

కొత్త పెళ్లి కొడుకు చాలా హుషారుగా లోనికి వెళ్లేందుకు సిద్దం అవుతున్న సమయంలో అతడి తండ్రి అయిన షణ్ముగం వచ్చి పెళ్లికి వచ్చిన చదివింపులు మరియు కానుకల వివరాలు చెప్పాలని, అవన్ని తనకు ఇవ్వాలంటూ అడిగాడు.

శోభనం మూడ్‌లో ఉన్న ఇళమది రేపు ఆ విషయాలు అన్ని చెప్తాను అంటూ లోనికి వెళ్లబోయాడట.

అయితే అయిదు నిమిషాల్లో చెప్పేసి, అవన్ని ఇచ్చేసి వెళ్లమని తండ్రి అడ్డుకున్నాడట.బయట ఇచ్చే వారికి ఇవ్వాల్సి ఉంది.

ఆ లెక్కలు చెప్పమంటూ వాగ్వివాదంకు దిగాడు.కొడుకు మాట వినక పోవడంతో పక్కనే ఉన్న దుడ్డు కర్రతో కొట్టేందుకు ప్రయత్నించాడు.

దాంతో అతే కర్రను లాక్కున్న కొత్త పెళ్లి కొడుకు తండ్రి తలపై ఒక్కటి ఇచ్చాడు.

దాంతో తండి అక్కడికక్కడే మృతి చెందాడు. """/"/ క్షణికావేశంలో తండ్రిని కొట్టిన ఆ యువకుడు ఇప్పుడు పోలీసుల కస్టడీలో ఉన్నాడు.

ఫస్ట్‌ నైట్‌ కోసం ప్రాకులాడి కాస్త ఆలస్యం అవుతుందని తండ్రిని చంపి మొత్తం జీవితాన్ని నాశనం చేసుకున్నాడు.

ఇక్కడ ఆ తండ్రిని కూడా తప్పుబట్టాల్సిందే.ఎందుకంటే కొడుకు పరిస్థితి అర్ధం చేసుకుని రేపటికి లెక్కల విషయం వాయిదా వేస్తే బాగుండేది.

మొత్తానికి ఇద్దరు కూడా అనాలోచితంగా వ్యవహరించి కుటుంబంలో విషాదాన్ని నింపారు.

వలసదారుల సంక్షోభం .. ఫ్లైటెక్కిన తొలి శరణార్ధి, బ్రిటన్‌ రువాండా ప్లాన్ వర్కవుట్ అయినట్లేనా .. ?