తెలంగాణ గవర్నర్ గా ఏపీ బీజేపీ నేత ? 

తెలంగాణలో తమ పట్టు పెంచుకునేందుకు బిజెపి( BJP ) ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది.

అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా బిజెపి మెజార్టీ సీట్లు సాధించి అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ పెద్దలు అంచనా వేసినా, ఊహించని విధంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.

ఇంకా ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాస్త సానుకూలంగానే ఫలితాలు వెలువడడంతో, బిజెపి ఆశలు చిగురించాయి.

ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ బాగా బలహీనం కావడంతో,  వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ పై పై చేయి సాధించి బిజెపిని అధికారంలోకి తీసుకువచ్చే వ్యూహంతో బిజెపి పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు.

దీనిలో భాగంగానే వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారు.తెలంగాణలో( Telangana ) రెండో స్థానం కోసం బిజెపి వ్యూహాలు రచిస్తోంది.

ఇప్పటికే తెలంగాణకు చెందిన ఇద్దరు ఎంపీ లకు కేంద్రమంత్రి పదవులు ఇచ్చారు. """/" / తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి ,( Kishan Reddy ) మాజీ తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కు( Bandi Sanjay ) కేంద్ర మంత్రి పదవులు దక్కాయి.

  త్వరలోనే బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికి తెలంగాణ అధ్యక్ష పదవిని ఇచ్చే ఆలోచనతో ఉన్నారు.

దీనిపై త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు.  ఇక అసలు విషయానికొస్తే తెలంగాణ గవర్నర్( Telangana Governor ) నియామకం విషయంపై బిజెపి పెద్దలు ఫోకస్ చేశారు.

ఈ మేరకు ఏపీ బీజేపీకి చెందిన బిజెపి సీనియర్ నేత సోము వీర్రాజు( Somu Veerraju ) పేరును తెలంగాణ గవర్నర్ గా ఎంపిక చేసే ఆలోచనతో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

ఇటీవల ఏపీలో జరిగిన అసెంబ్లీ ,పార్లమెంట్ ఎన్నికల్లో సోము వీర్రాజు టిక్కెట్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేసినా,  ఆయనకు అవకాశం దక్కలేదు .

దీంతో సోము వీర్రాజు పార్టీ కోసం అంతగా కష్టపడినా,  ఆయనకు అన్యాయం జరిగిందనే అభిప్రాయం బిజెపి నేతల్లో నెలకొనడంతో,  సోము వీర్రాజుకు న్యాయం చేసేందుకు , తెలంగాణలో  కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడుకు బ్రేక్ వేసేందుకు  వీర్రాజు ను తెలంగాణ గవర్నర్ గా నియమించేందుకు కసరత్తు చేస్తున్నారట.

"""/" / వాస్తవంగా మాజీ సీఎం , ప్రస్తుత బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి( Nallari Kiran Kumar Reddy ) తెలంగాణ గవర్నర్ గా అవశం ఇవ్వాలని ముందుగా భావించినా,  ఈ విషయంలో బీఆర్ఎస్ తీవ్రంగా విమర్శలు సోషల్ మీడియా వేదికగా చేయడం,  తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వను అంటూ ప్రకటించిన కిరణ్ కుమార్ రెడ్డికి ఆ పదవి ఇస్తే ఊరుకునేది లేదు అంటూ స్పందించిన నేపథ్యంలో,  సోము వీర్రాజు వైపు బిజెపి అధిష్టానం మొగ్గు చూపిస్తూ ఉండడంతో.

త్వరలోనే తెలంగాణ గవర్నర్ గా ఆయన పేరును ప్రకటించే అవకాశం ఉన్నట్లు బిజెపిలోని కీలకవర్గాలు పేర్కొంటున్నాయి.

ఇదీ ప్రభాస్ రేంజ్.. అక్కడ 10 సినిమాలలో 6 ప్రభాస్ సినిమాలు మాత్రమే ఉన్నాయా?