టీడీపీ - జనసేన పార్టీలపై సోము వీర్రాజు వైరల్ కామెంట్స్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తుల చుట్టూ రాజకీయ వాతావరణం క్రియేట్ అయింది.ఇంకా ఎన్నికలకు రెండు సంవత్సరాలు ఉన్నా కానీ ప్రధాన పార్టీల నేతలు పొత్తుల విషయంలో కీలక ప్రకటనలు చేస్తూ ఉన్నారు.

ప్రజా ఉద్యమం కోసం పార్టీలు ఏకం కావాలని ఇప్పటికే చంద్రబాబు పిలుపు నివ్వడం తెలిసిందే.

మరోపక్క వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కర్నూలు పర్యటనలో నిన్న ప్రకటనలు చేశారు.

దీంతో జనసేన టిడిపి పొత్తు గ్యారెంటీ అనే టాక్ బలంగా వినబడుతోంది.పరిస్థితి ఇలా ఉంటే తాజాగా ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పొత్తుల విషయానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు.

బీజేపీకి జనంతోనే పొత్తు.అవసరమైతే జనసేన తో పొత్తు అని అన్నారు.

ఇంకో పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చేశారు.ఇక ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ జనసేన కలుస్తాయా లేదా అనేది పవన్ కళ్యాణ్ ని అడిగి తెలుసుకోవాలని మీడియా ప్రతినిధులకు తెలియజేశారు.

దేశంలో బిజెపి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తుందని అందువల్ల ప్రజలనీ ఓట్లు అడుగుతున్నామని పేర్కొన్నారు.

బీజేపీకి రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమని ఖచ్చితంగా వచ్చే సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ విజయం సాధిస్తుందని సోము వీర్రాజు స్పష్టం చేశారు.

రూ.10 లక్షల విరాళం ప్రకటించినా రష్మికపై ట్రోల్స్.. అలా చేయడమే తప్పైందా?