జగనన్న కాలనీ లపై సోము వీర్రాజు సీరియస్ కామెంట్స్..!!
TeluguStop.com
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు జగనన్న కాలనీలా పేరట అక్రమాలు జరుగుతున్నట్లు వైసీపీ ప్రభుత్వం పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.
జగనన్న కాలనీల పేరిట భూములు కొనుగోలు విషయంలో అవినీతి జరిగిందని ఆరోపించారు.ఇళ్ల నిర్మాణాలలో అక్రమాలు చేస్తూ పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తారా అంటూ వైసీపీ నేతలపై మండిపడ్డారు.
ఈ అంశంపై జనసేన పార్టీతో కలిసి బీజేపీ పోరాటం చేస్తుందని సోము వీర్రాజు స్పష్టం చేశారు.
రాష్ట్రంలో పేదల ఇళ్ళ నిర్మాణం కోసం కేంద్రం 35 వేల కోట్లు ఇచ్చిందని తెలిపారు.
వైసీపీ ప్రభుత్వం ఇళ్ళ నిర్మాణం విషయంలో ఆలస్యం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో సోమ వీర్రాజు చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. జనసేన పార్టీ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా "జగనన్న ఇల్లు పేదలకున్నీరు" పేరుతో.
జగనన్న కాలనీలలో ఉన్న లోపాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.ఈ కార్యక్రమాన్ని ముందుగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విజయనగరం జిల్లా గుంకాలంలో పర్యటించి ప్రశ్నించడం జరిగింది.
అక్కడ జగనన్న కాలనీలలో పర్యటించి.ప్రభుత్వంపై పవన్ వేసిన ప్రశ్నలకు వైసీపీ మంత్రులు కౌంటర్లు వేయడం జరిగింది.
ఈ పరిణామంతో అక్రమాలపై ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ ని వైసీపీ నేతలు విమర్శించడాని.
సోమ వీర్రాజు తప్పు పడుతూ తనదైన శైలిలో కౌంటర్లు ఇచ్చారు.
వదల బొమ్మాళీ వదల అంటూ పుట్టగానే కత్తెర పట్టుకున్న పసిబిడ్డ.. వైరల్ వీడియో!