ఒత్తిడి, కోపం తగ్గించే విగ్రహం.. థాయ్ ఆర్టిస్ట్‌లు క్రియేటివ్ ఐడియా..

సాధారణంగా ప్రజలు తమ జీవితంలో ఎంతోమంది చర్యల వల్ల బాగా అసంతృప్తిని పెంచుకుంటారు.

ఉదాహరణకి టీచర్ల పట్ల స్టూడెంట్స్, మేనేజర్ల పట్ల ఉద్యోగులు, మాజీ లవర్స్ పట్ల ప్రేమికులు, భార్య పట్ల భర్తలు, బంధువుల పట్ల కుటుంబ సభ్యులు, ఇలా చెప్పుకుంటూ పోతే రకరకాల మనుషులపై కోపం, అసహ్యం, పగ వంటివి ఏర్పరచుకుంటాం.

కానీ వీరిపై మనకున్న కోపాన్ని వ్యక్తపరచలేం.అలా చేస్తే ఉన్న కష్టాలు మరింత ఎక్కువవుతాయి.

ఇలా ఏమి చేయకుండా ఉండలేకపోవడం వల్ల మనసు చాలా భారంగా మారుతుంది.ఒక రిలీఫ్ అనేది దొరకదు.

అయితే థాయ్‌లాండ్‌ ఆర్టిస్టులు( Thailand Artists ) ఇలాంటి వ్యక్తులకు ఉపశమనం అందించే ఒక అదిరిపోయే ఆలోచన చేశారు.

తమ బాస్‌, ఎక్స్‌ లవర్ ఇలా ఎవరిపైన కోపంగా ఉన్నా థాయ్‌లాండ్‌లో దీనికి ఒక విచిత్రమైన పరిష్కారం ఉంది.

అక్కడి కళాకారులు మనం అసహ్యించుకునే వ్యక్తుల (బాస్, భార్య/భర్త, శత్రువు) మట్టి విగ్రహాలు( Clay Sculptures ) చేస్తారు.

ఆ విగ్రహాలను చూసి మన కోపం తీరిపోతుంది.అంటే, మన కోపాన్ని( Anger ) ఆ విగ్రహాలపై ప్రదర్శించవచ్చు.

ఈ విధంగా మన మనసుకు ఒక సంతృప్తి లభిస్తుంది.అదే సమయంలో, కళాకారులు డబ్బు సంపాదిస్తారు.

ఒక వీడియోలో, ప్రజలు ఆ విగ్రహాలను ముఖం మీద కొడుతూ, తమ కోపాన్ని వెళ్లగక్కడం చూపించారు.

అంత కొట్టినా ఆ విగ్రహాలకు ఏమీ కాదు. """/" / థాయ్‌లాండ్‌లో ఈ విచిత్రమైన రకమైన స్ట్రెస్ రిలీఫ్( Stress Relief ) గురించి పోస్ట్ ఎక్స్‌ (ట్విట్టర్‌)లో ఒక వీడియో షేర్ చేశారు దానికి నాలుగు కోట్ల దాకా వ్యూస్ వచ్చాయి.

ఈ పోస్ట్‌ను చూసిన చాలా మంది తమ అభిప్రాయాలను తెలియజేశారు.ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఇది చాలా సురక్షితమైన, ప్రభావవంతమైన మార్గం అని అన్నారు.

"నీ విగ్రహాన్ని కూడా ఎవరో ఒకరు ఇలాగే తయారు చేయించి దాన్ని దారుణంగా కొట్టే వరకు ఇది చాలా ఆనందంగా ఉంటుంది.

" అని ఒక యూజర్ కామెంట్ చేశారు.మరొకరు, "నీ వెనక్కి తిరిగి చూస్తే, నీ కుటుంబం, స్నేహితులు చేతిలో కొట్టే ఆయుధాలు పట్టుకొని నిన్ను చూస్తున్నట్లు అనిపిస్తుంది" అని జోక్ చేశారు.

"""/" / మరొకరు, "నా పాత ఆర్ట్ టీచర్ క్లాస్‌లో ఇలా చేయడానికి అనుమతిస్తుంది.

నేను ఆమె ముఖం లాంటి విగ్రహం చేశాను.ఆ తర్వాత మా సంబంధం బాగా లేదు" అని పంచుకున్నారు.

డబ్బు సంపాదించడానికి ఇది ఒక తెలివైన ఆలోచన అని ఒకరు చెప్పారు, "ప్రతి దేశంలో ఎన్నికలకు ముందు ఇది ప్రారంభించండి.

అన్ని రాజకీయ పార్టీల నాయకుల విగ్రహాల కోసం కియోస్క్‌లు తెరవండి.ఎన్నికల తర్వాత మీరు కోట్టీశ్వరులు కావచ్చు.

" అని ఇంకొకరు మంచి సలహా ఇచ్చారు.అయితే, చాలా మంది ఈ ఆలోచన గురించి సందేహం వ్యక్తం చేసి, దీనిని "ఒక ప్రమాదకరమైన సంకేతం" అని అన్నారు.

నేడు ఏపీ క్యాబినెట్ భేటీ .. వీటిపైనే కీలక నిర్ణయాలు