Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ప్రస్తుతం ఎలా ఉన్నాడో ఏం చేస్తున్నాడో తెలుసా.. పొలం పనులు చేసుకుంటూ అలా?
TeluguStop.com
టిక్ టాక్ దుర్గారావు.( Tiktok Durga Rao ) రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
టిక్ టాక్ ( TikTok ) ద్వారా బాగా ఫేమస్ అయిన వారిలో ఇతను కూడా ఒకరు.
ఇతను ఎన్నో టిక్ టాక్ వీడియోలు తీసినప్పటికీ నాది నెక్లెస్ గొలుసు అనే పాటకు ఇతని భార్యతో కలిసి చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో కావడంతో ఓవర్ నైట్ లోనే స్టార్ అయిపోయాడు.
ఆ తర్వాత కూడా ఎన్నో వీడియోలు చేసి సోషల్ మీడియాలో మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు.
దీనితో ఇతనికి బుల్లితెరపై కూడా పలు అవకాశాలు వచ్చాయి. """/" /
దుర్గారావు అతని భార్య ఇద్దరూ కలిసి బుల్లితెరపై పలు షోలలో కనిపించి ఆకట్టుకున్నారు.
దుర్గారావు వేసిన స్టెప్పులు ఎంత ఫేమస్ అంటే మన స్టార్ హీరోలు కూడా దుర్గా రావు చేసిన స్టెప్పులు చేసారంటే ఆయన క్రేజ్ అర్థం చేసుకోవచ్చు.
ఆమధ్య కొన్ని షార్ట్ ఫిల్మ్స్‌లోను అలరించాడు.ఎప్పుడైతే టిక్ టాక్ ఇండియాలో బ్యాన్ అయ్యిందో ఇక అప్పటి నుంచి ఆయన పాపులారిటీ తగ్గింది.
షేర్ చాట్, యూట్యూబ్ షార్ట్స్ వంటీ యాప్‌ల్లో కనిపించినా టిక్ టాక్‌లో వచ్చినంత క్రేజ్ రాలేదు.
దీంతో ఈ మధ్యకాలంలో కనిపించడమే మానేసాడు. """/" /
ఇది ఇలా ఉంటే తాజాగా దుర్గారావుకి సంబంధించిన ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది.
అదేమిటంటే యూట్యూబ్ ఛానెల్ నుంచి అతడికి ప్రతినెల డ్యాన్స్, కామెడి వీడియోలకు 20 నుంచి 30 వేల వరకూ ఆదాయం వస్తుందని తెలుస్తోంది.
ఆ తరువాత అడపా దడపా కొన్ని షార్ట్ ఫిల్మ్స్‌తో పాటు షోస్ చేసుకుంటూ వచ్చాడు.
అయితే కొన్నాళ్ల పాటు హైదరాబాద్‌లో నివసించిన దుర్గారావు ప్రస్తుతం పెద్దగా అవకాశాలు లేకపోవడంతో ఆయన తన సొంత ఊర్లోనే ఒక పక్కా వ్యవసాయ పనులు( Farming ) చేసుకుంటూ మరోపక్క డాన్స్ వీడియోలు చేసుకుంటున్నాడు.