జైత్ర మూవీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు…
TeluguStop.com
రీసెంట్ గా వచ్చిన చిన్న సినిమాల్లో ఒక మంచి సినిమా గా గుర్తింపు పొందిన సినిమా ఏదైనా ఉంది అంటే అది జైత్ర సినిమా( Jaitra Movie ) అనే చెప్పాలి.
షార్ట్ ఫిల్మ్స్( Short Films ) లో హీరోగా చేసే సన్నీ నవీన్ హీరోగా, రోహిణి రచ్చెల్ ( Rohini Rachel )హీరోయిన్ గా మల్లికార్జున్ తోట అనే కొత్త డైరెక్టర్, డైరెక్షన్ లో వచ్చిన సినిమా జైత్ర.
ఈ సినిమా మొదటి టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఆడియన్స్ లో మంచి అటెన్షన్ ని క్రియేట్ చేసింది.
ఇక అప్పటి నుంచే ఈ సినిమా మీద ఆడియెన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.
"""/" /
ఒక రెండు ఎడ్లు, కొంత పొలం ఉండి అవసరానికి కొంత మంది దగ్గర అప్పులు చేసి అవి తీర్చడానికి ఆ అబ్బాయి పడే భాద, ఆ ప్రాసెస్ లోనే ఆ కుర్రాడికి ఒక పట్నం పిల్లకి మధ్య కలిగిన పరిచయం అలకలు, పోట్లాటలతో సాగే ఈ సినిమా ఆద్యంతం ఆసక్తిగా సాగుతుంది.
పక్క పల్లెటూరిలో పెరిగి జనంతో పాటు కలిసి తిరిగే ఒక అబ్బాయి గా సన్ని నవీన్ పాత్ర చాలా బాగా రాసుకున్నారు డైరెక్టర్.
అయితే డైరెక్టర్ క్రియేట్ చేసుకున్న క్యారెక్టరైేజేషన్స్ కూడా చాలా అద్బుతం గా ఉన్నాయి.
ఇక హీరోయిన్ గా చేసిన రోహిణి కూడా న్యాచురల్ లుక్స్ తో చూడడానికి చాలా అందం గా కనిపిస్తుంది.
"""/" /
ఒక చిన్న కథని డైరెక్టర్ చాలా ఎమోషన్స్ ని కలిపి చెప్పిన తీరు కూడా జనాలకి బాగా నచ్చుతుంది.
ఈ మధ్య కాలం లో వచ్చిన సినిమాల్లో ఈ సినిమా ఒక డీసెంట్ హిట్ సినిమా అనే చెప్పాలి ముఖ్యంగా డైరెక్టర్ ఈ మూవీ ని తెరకెక్కించిన విధానం చాలా బాగుంది.
ఆయన మేకింగ్ స్టైల్ కూడా చాలా వరకు కొత్తగా అనిపించింది.అలాగే మనం గమనిస్తే ఈ సినిమా టైటిల్స్ లో కూడా జైత్ర అనే టైటిల్ లోగోను ఒక ఎద్దు వచ్చెలాగా క్రియేట్ చేయించాడు డైరెక్టర్.
అక్కడే మనకు ఆయన క్రియేటివిటీ ఏంటి అనేది అర్థం అవుతుంది.ఈ సినిమాలో సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి.
ఈ సినిమా చూడటం వల్ల మొత్తానికి అయితే ఈ రీసెంట్ టైం లో ఒక మంచి పల్లెటూరు సినిమా చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది.
ఇక డైరెక్టర్ మల్లికార్జున్ తోట కి ముందు ముందు డైరెక్టర్ గా మంచి అవకాశాలు వస్తాయి అనడం లో ఎలాంటి సందేహం లేదు.
వీలైతే మీరు కూడా చూడండి.మంచి సినిమాని ఎంకరేజ్ చేయండి.
స్పోర్ట్స్ షూస్‌తో ఆఫీసుకు వచ్చింది.. కట్ చేస్తే రూ.30 లక్షలు గెలుచుకుంది?