భారతీయ విద్యార్ధులపై ఆస్ట్రేలియన్ యూనివర్సిటీల ఆంక్షలు.. ఎందుకంటే..?

భారతీయులు ఉన్నత విద్య నిమిత్తం విదేశాలకు వెళ్లే పరిస్ధితులు ఇటీవలి కాలంలో మెరుగయ్యాయి.

అమెరికా, బ్రిటన్, కెనడా, జర్మనీ(America, Britain, Canada, Germany) తదితర దేశాలకు భారతీయులు వెళ్లి చదువుకుంటున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్నత విద్యకు కేంద్రంగా ఉన్న దేశాల్లో ఆస్ట్రేలియా(Australian ) ఒకటి.ప్రపంచస్థాయి విద్యాసంస్థలు, మెరుగైన జీవితం, ప్రశాంత వాతావరణం తదితర అంశాలతో ఆస్ట్రేలియా భారతీయ విద్యార్ధులను ఆకర్షిస్తోంది.

అయితే వలసలు నానాటికీ పెరిగిపోతుండటంతో ఆ దేశ ప్రభుత్వం అప్రమత్తమైంది.అంతర్జాతీయ విద్యార్ధుల పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన విధానాలు అవలంభిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ఆస్ట్రేలియా విద్యాసంస్థలు (Australian Universities)భారతీయ విద్యార్ధులను నిషేధించడం కలకలం రేపుతోంది.

వీసాల మోసం, విద్యా వ్యవస్ధ దుర్వినియోగం పెరిగిన తర్వాత ఆస్ట్రేలియా ఈ నిర్ణయం తీసుకుంది.

"""/" / గుజరాత్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, జమ్మూకాశ్మీర్ నుంచి వచ్చే భారతీయ విద్యార్ధులపై ఆస్ట్రేలియా విద్యాసంస్ధలు కఠినమైన ఆంక్షలు విధించాయి.

విద్యార్ధి వీసాలను విద్యకు బదులుగా వలసల కోసం ఉపయోగిస్తున్నట్లు తేలడంతో ఆస్ట్రేలియన్ యూనివర్సిటీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.

నివేదికల ప్రకారం.ఆస్ట్రేలియా విద్యార్ధి వీసా దరఖాస్తు ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి హోంశాఖ, యూనివర్సిటీలు సహకరించుకుంటున్నాయి.

"""/" / కాగా.మోసాలు, నకిలీ డాక్యుమెంట్లతో స్టూడెంట్ వీసాకు(Student Visas With Fraud And Fake Documents) దరఖాస్తులు పెరుగుతున్న నేపథ్యంలో గతంలోనూ ఆస్ట్రేలియాలోని కొన్ని యూనివర్సిటీలు భారతీయ విద్యార్ధుల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నాయి.

పలు భారతీయ రాష్ట్రాలకు చెందిన విద్యార్ధులకు అడ్మిషన్ ఇవ్వకూడదని నిర్ణయించినట్లుగా అప్పట్లో కథనాలు వచ్చాయి.

విక్టోరియాలోని ఫెడరేషన్ యూనివర్సిటీ, న్యూసౌత్ వేల్స్‌లోని వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీలు భారతీయ రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, జమ్మూకాశ్మీర్‌లకు చెందిన విద్యార్ధులకు అడ్మిషన్ ఇవ్వొద్దని ఎడ్యుకేషన్ ఏజెంట్లకు సూచించడం అప్పట్లో దుమారం రేపింది.

ఈ పరిణామాలతో ఆస్ట్రేలియాలో చదవాలని ప్లాన్ చేసుకుంటున్న భారతీయ విద్యార్ధులను ఆందోళనకు గురిచేస్తోంది.