గ్రామాల్లో వేసవి నీటి కష్టాలు తీర్చండి…!

సూర్యాపేట జిల్లా: హుజూర్ నగర్( Huzur Nagar ) మండల వ్యాప్తంగా వేసవి నీటి ఎద్దడితో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు అల్లాడుతున్నారని సీపీఎం హుజూర్ నగర్ మండల కార్యదర్శి పోసనబోయిన హుస్సేన్,అన్నారు.

మంగళవారం మండల పరిధిలో గోపాలపురం ( Gopalapuram _)గ్రామంలో నెలకొన్న నీటి మరియు ఇతర సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

రెండు నెలలుగా బండమీద కాలనీలో వాటర్ సౌకర్యం లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని కాలనీ వాసులు చెప్పారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో నీటి సౌకర్యం లేక ప్రజలు అవస్థలు పడుతున్నారని,అనేకసార్లు గ్రామ సర్పంచ్, సెక్రటరీకి తెలిపినా కనీసం పట్టించుకునే పరిస్థితి లేదని అవేదన వ్యక్తం చేశారు.

9,10 వార్డుల్లో వాటర్ సౌకర్యం లేక( Water Problems ) అర కిలోమీటర్ దూరం వెళ్లిమహిళలు బట్టలు ఉతుకొని,నీళ్ళు తెచ్చుకుంటే,కొందరు మినరల్ వాటర్ కొనుగోలు చేసి వాడుకుంటూ, స్నానాలు కూడా చేస్తూ నానా కష్టాలుపడుతున్నారని అన్నారు.

తక్షణమే అధికారులు స్పందించి ఆ కాలనీలో ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకోవాలనికోరారు.లేనిపక్షంలో కాలనీ ప్రజలతో ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు,సిపిఎం నాయకులు పాల్గొన్నారు.

ఒక్క వీడియోతో అంచనాలు పెంచేసిన బన్నీ అట్లీ.. మూవీ ఇండస్ట్రీ హిట్ అయ్యే ఛాన్స్!