మంచినీటి సమస్య నీ తక్షణమే పరిష్కరించండి:- కలెక్టర్ కి కౌన్సిలర్ లు విజ్ఞప్తి

కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో నెలకొన్న తీవ్ర మంచినీటి సమస్యను తక్షణమే పరిష్కరించి ప్రతిరోజు మంచినీళ్లు ప్రజలకు అందేలా యుద్ధ ప్రాతిపదికన తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ ని సిపిఐ కౌన్సిలర్ల బృందం కలిసి సమస్య నీ వివరించారు.

ఈ సందర్భంగా గా 23 వ వార్డు కౌన్సిలర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వై శ్రీనివాస్ రెడ్డి కలెక్టర్ తో మాట్లాడుతూ తీవ్ర ఎండాకాలం దృష్టిలో పెట్టుకొని మంచినీటి సమస్య ప్రజలకు రాకుండా ప్రతి రోజు నీళ్లు అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పారు.

అదేవిధంగా మిషన్ భగీరథ ద్వారా కిన్నెరసాని నీళ్లు రాని రోజు మిషన్ భగీరథ ద్వారా ప్రత్యామ్నాయంగా నీళ్లు ఇచ్చేలా చూడాలని చెప్పారు.

అట్లాగే నూతన కొత్త పైప్ లైన్ మరియు పెయింటర్ బెడ్స్ ట్యాంకులు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు సాధించి కిన్నెరసాని నూతన పైపులైన్లు, ఫిల్టర్ బెడ్స్, మోటార్స్ అదేవిధంగా ఇరవై నాలుగు గంటలు కరెంటు ఏర్పాటు చేసి ప్రతి రోజు టైం ప్రకారంగా కొత్తగూడెం ప్రజలకు నీళ్లు అందించేలా భవిష్యత్తు చర్యలు తీసుకోవాలని విన్నవించారు.

కలెక్టర్ ని కలిసినవారిలో సిపిఐ కౌన్సిలర్ల బృందంలో 8వ వార్డు కౌన్సిలర్ కంచర్ల జమలయ్య, 1 వార్డు కౌన్సిలర్ బోయిన, విజయ్ కుమార్ .

18 వ వార్డు కౌన్సిలర్ పి.సత్యనారాయణ చారి తదితరులు ఉన్నారు.

ఆర్ఆర్ఆర్ కంటే ఎక్కువ బిజినెస్ తో బన్నీ సంచలనం.. అసలేం జరిగిందంటే?