నితిన్ 'మాచర్ల' ట్రైలర్ రెస్పాన్స్ అదుర్స్.. 11 గంటల్లోనే..

టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో యూత్ స్టార్ నితిన్ ఒకరు.ఈయన తన నటనతో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నారు.

ఒక హిట్టు.ఒక ప్లాప్ అంటూ ఈయన కెరీర్ బ్యాలెన్స్ గా సాగుతుంది.

ఎన్ని ప్లాప్స్ వచ్చిన పట్టువీడకుండా మళ్ళీ సినిమాలు చేస్తూ మంచి హిట్ తో కెరీర్ ను కొనసాగిస్తున్నాడు.

నితిన్ ప్రెసెంట్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.తాజాగా ఈయన నటించిన మాచర్ల నియోజక వర్గం రిలీజ్ కు రెడీ అవుతుంది.

డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగష్టు 12న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

నితిన్ నుండి చాలా రోజుల తర్వాత ఒక మాస్ సినిమా రాబోతుండడంతో ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రొమోషన్స్ కూడా స్టార్ట్ చేసారు.

ఈ క్రమంలోనే తాజాగా మాచర్ల నియోజకవర్గం నుండి మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్ ను జులై 30న రిలీజ్ చేసారు.

ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జులై 30న గ్రాండ్ గా గుంటూరు బ్రాడీపేట లోని ఎల్ ఈ ఎం స్కూల్ గ్రౌండ్స్ లో జరిగింది.

"""/"/ ఇక ఈ ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది.నితిన్ నుండి చాలా రోజుల తర్వాత మాస్ సినిమా రాబోతుండడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.

ఇక ఈ ట్రైలర్ రిలీజ్ అయినా 11 గంటల్లోనే 7 మిలియన్ మార్క్ టచ్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.

టైర్ 2 హీరోలకు ఈ రికార్డ్ చాలా ఎక్కువ అనే చెప్పాలి.ఇక ఈ సినిమాలో సముద్రఖని విలన్ పాత్రలో నటిస్తుండగా.

కృతి శెట్టి, క్యాథరిన్ త్రేస్సా హీరోయిన్ లుగా నటిస్తున్నారు.అలాగే తెలుగమ్మాయి అంజలి ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించింది.

ఈ సాంగ్ ఇప్పటికే రిలీజ్ అయ్యి ఆకట్టుకుంది.ఇక మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను శ్రేష్ఠ మూవీస్ వారు నిర్మిస్తున్నారు.

మరి ఈ సినిమాతో నితిన్ మరో హిట్ తన ఖాతాలో వేసుకుంటాడో లేదో చూడాలి.

పదేళ్లుగా ఆ వ్యక్తి ప్రేమలోనే… మొత్తానికి క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి!