”బ్రో” ఫస్ట్ లుక్ కు యునానిమస్ రెస్పాన్స్.. ఇది పక్కా హిట్టే!
TeluguStop.com
వినోదయ సీతం అనే తమిళ్ బ్లాక్ బస్టర్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.
ఇక్కడ నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి తెరకెక్కిస్తున్నారు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండ్ మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న ఈ మోస్ట్ ఏవైటెడ్ మూవీ నుండి నిన్న టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ను మేకర్స్ రివీల్ చేసిన విషయం తెలిసిందే.
"""/" /
ఇప్పటి వరకు ''PKSDT'' అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కించగా ఇప్పుడు ఈ సినిమాకు టైటిల్ ప్రకటించారు.
''బ్రో'' అనే టైటిల్ ను నిన్న ప్రకటించగా ఈ టైటిల్ కు యునానిమస్ రెస్పాన్స్ లభించింది.
ఇది రీమేక్ అని పవర్ స్టార్ మరో రీమేక్ నే చేస్తున్నాడు అని ఆయన ఫ్యాన్స్ డిజప్పోయింట్ అయిన విషయం తెలిసిందే.
కానీ ఈ ఫస్ట్ లుక్ చూసిన వారంతా ఈ సినిమాలో కనిపించిన మార్పులకు ఖుష్ అవుతున్నారు.
ఎంతైనా త్రివిక్రమ్ చేయి పడ్డాక అది రీమేక్ అని కూడా అనిపించకుండా చేస్తాడు.
త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు కూడా అందిస్తుండడంతో సాలిడ్ బజ్ వస్తుంది.యాక్టర్ అండ్ డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వంలో ఈ రీమేక్ మూవీ తెరకెక్కుతుంది.
తమిళ్ లో కూడా సముద్రఖని డైరెక్ట్ చేసి నటించిన ఈ సినిమా అక్కడ మంచి లాభాలను తెచ్చిపెట్టింది.
దీంతో ఈయన దర్శకత్వంలోనే ఇక్కడ కూడా సినిమా చేస్తున్నారు. """/" /
ఇప్పటికే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తన షూట్ ను పూర్తి చేసాడు.
దాదాపు 80 శాతం వరకు షూట్ పూర్తి కాగా మిగిలిన షూటింగ్ ను కూడా శరవేగంగా గ్యాప్ లేకుండా పూర్తి చేస్తున్నారు.
ఇక పీపుల్స్ మీడియా బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.
అలాగే కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ లు కూడా నటిస్తున్న ఈ సినిమా జులై 28న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.