‘ఉస్తాద్’లో కూడా గట్టిగానే ఇవ్వనున్న పవన్.. అంత జరిగిన తగ్గేదేలే అట!
TeluguStop.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) ఇటీవలే కీ రోల్ పోషించిన ''బ్రో ది అవతార్''( Bro ) మూవీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే.
ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుండి ఒక వివాదం నడుస్తూనే ఉంది.ఈ సినిమాలో ఏపీ మంత్రి అంబటి రాంబాబు( Ambati Rambabu ) వివాదం బ్రో సినిమాకు పెద్ద తలనొప్పిగా మారింది.
ఈ వ్యవహారంలో ఇంత రచ్చ జరిగిన మళ్ళీ పవన్ అడుగులు వైసీపీని టార్గెట్ చేసే విధంగానే ఉన్నాయి.
"""/"/
తన సినిమాల్లో పొలిటికల్ టచ్( Political Punches ) ఉండేలా పవన్ కళ్యాణ్ చూసుకుంటున్నాడు.
ఇక తన లైనప్ లో ఉన్న మరో సినిమాలో కూడా పొలిటికల్ సెటైరికల్ పంచెస్ బాగానే రాయించినట్టు తెలుస్తుంది.
మరి ఆ సినిమా ఏంటంటే 'ఉస్తాద్ భగత్ సింగ్''( Ustaad Bhagat Singh ).
ఈ సినిమా కోసం అంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఎందుకంటే వీరి కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు.
ఎప్పుడో 11 ఏళ్ల క్రితం ఈ సినిమా వచ్చి సంచలనం సృష్టించింది.ఎప్పుడో రెండేళ్ల క్రితమే ప్రకటించిన ఈ ప్రాజెక్ట్ పేరు మార్చి మళ్ళీ ఈ ఏడాది స్టార్ట్ చేసారు.
అయితే అలా స్టార్ట్ అయ్యి ఒక షెడ్యూల్ మాత్రమే పూర్తి చేసుకోగా వెంటనే మళ్ళీ వాయిదా పడింది.
కేవలం ఒక షెడ్యూల్ మాత్రమే షూటింగ్ జరుపుకోగా ఆ చిన్న షెడ్యూల్ తోనే హరీష్ పవన్ పై అదిరిపోయే గ్లింప్స్ రిలీజ్ చేసి ఆకట్టుకున్నాడు.
ఇక అతి త్వరలోనే ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ షూట్ ను మేకర్స్ స్టార్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది.
ఈ క్రమంలోనే ఈ సినిమా నుండి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది.ఈ సినిమాలో హరీష్ శంకర్ కు చెప్పి మరీ పొలిటికల్ సెటైర్స్ ను పవన్ రాయించినట్టు ఒక వార్త వైరల్ అయ్యింది.
ఎలాగూ 2024లో ఎలెక్షన్స్( 2024 Elections ) ఉన్నాయి కాబట్టి ఈ పొలిటికల్ టచ్ కూడా ఉంటే మరింత మైలేజ్ ఇచ్చినట్టు ఉంటుంది.
"""/"/
అందుకే ఈ సినిమాను ముందుగానే పూర్తి చేసి ఎన్నికల ముందే రిలీజ్ చేయాలని పవన్ కూడా అనుకుంటున్నారట.
ఈ క్రమంలోనే వీలైనంత ఫాస్ట్ గా ఈ సినిమాను పూర్తి చేసి 2024 పొంగల్ రేస్ లోకి పక్కాగా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట.
ఇక ఈ సినిమాలో ఇప్పటికే యంగ్ బ్యూటీ శ్రీలీల( Sreeleela ) హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.
అలాగే ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
చిన్నోడితో సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకున్న పెద్దోడు… సంక్రాంతికి వస్తున్నాం టీమ్ తో మహేష్!