దేవర మూవీ ట్రైలర్ పై షాకింగ్ అప్ డేట్ వైరల్.. అప్పటివరకు ఎదురుచూపులు తప్పవా?

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) గురించి మన అందరికి తెలిసిందే.

కాగా ఎన్టీఆర్ చివరగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి సక్సెస్ ను సాధించడంతో పాటుతో ఈ సినిమాతో గ్లోబల్ స్టార్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు.

ప్రస్తుతం ఒకవైపు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర మూవీలో( Devara Movie ) నటిస్తూనే మరోవైపు వార్ 2 సినిమాలో కూడా నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.

కాగా దేవర మూవీ సెప్టెంబర్ లో విడుదల కానున్న విషయం తెలిసిందే. """/" / అయితే విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు.

అందులో భాగంగానే సినిమా నుంచి ఒక్కొక్క అప్డేట్ ని విడుదల చేస్తున్నారు.ఈ సినిమా కోసం అభిమానులు కూడా ఒక రేంజ్ లో ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ చిత్రం నుంచి వచ్చిన సాంగ్స్ ఆల్రెడీ భారీ హిట్ అయ్యాయి.

అయితే ఇక సమయం దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్, వదిలే కంటెంట్ పరంగా కూడా స్పీడ్ పెంచాల్సి ఉంది.

ఇలా దేవర ట్రైలర్ పై( Devara Trailer ) ఇప్పుడు సాలిడ్ బజ్ అయితే వినిపిస్తుంది.

దీనితో ఈ అవైటెడ్ ట్రైలర్ ని మేకర్స్ ఈ సెప్టెంబర్ మధ్యలో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.

"""/" / దీనితో సెప్టెంబర్ 15కి అలా వదిలే ప్లాన్ లో ఉన్నారట.

మరి దీనిపై అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది.ఇక ఈ చిత్రంకి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు నిర్మాణం వహిస్తుండగా ఈ సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో సినిమా రిలీజ్ కాబోతుంది.

అయితే ప్రస్తుతం తారక్ ఫ్యాన్స్ దేవర ట్రైలర్ కోసమే ఎదురు చూస్తున్నారు.కానీ ప్రస్తుతం పరిస్థితులను బట్టి చూస్తుంటే ట్రైలర్ ఇంకా ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది.

రోజు నైట్ ఈ మిరాకిల్ క్రీమ్ ను వాడితే కళ్ళ చుట్టూ నల్లటి వల‌యాలు పరార్!