హైదరాబాద్‌లో మరో నూతన ఆవిష్కరణ.. సోలార్ పైకప్పుతో సైకిల్ ట్రాక్ షురూ!
TeluguStop.com
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ హైదరాబాద్‌ని కొత్త పుంతలు తొక్కిస్తున్నాడు.ఇప్పటికీ పలు పరిశ్రమలను నెలకొల్పిన ఘనత వారికుంది.
తాజాగా మరో ఆవిష్కరణకు సన్నాహాలు చేస్తోంది కెసిఆర్ ప్రభుత్వం.అవును.
త్వరలో హైదరాబాద్ లో సైకిల్ ట్రాక్ అందుబాటులోకి రానుంది.అయితే ఇది కేవలం సైకిల్ ట్రాక్ మాత్రమే కాదు.
సోలార్ రూఫ్‌తో సైకిల్ ట్రాక్ ఏర్పాటు కావడం ఇక్కడ విశేషం.సోలార్ ప్యానెళ్ల నీడలో ఎంచక్కా సైకిల్ తొక్కొచ్చన్న మాట.
సోలార్ ప్యానెళ్ల వల్ల విద్యుత్ ఉత్పత్తి కావడంతోపాటు.సైక్లింగ్ చేసేవాళ్లకు వర్షం, ఎండ నుంచి రక్షణ లభిస్తుంది.
ఇకపోతే, పైలట్ ప్రాజెక్ట్‌గా 'కోకాపేట' ఏరియాలో సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
ఔటర్ రింగ్ రోడ్డుపై 21 కిలోమీటర్ల పొడవైన సోలార్ సైకిల్ ట్రాక్ నిర్మాణ ప్రతిపాదనల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం దీన్ని నిర్మిస్తోంది.
HMD అధికారులు ఈ విషయమై మాట్లాడుతూ."రాష్ట్ర ప్రభుత్వం ఆమోదంతో పైలట్ ప్రాజెక్ట్‌గా ఈ ట్రాక్ నిర్మాణం చేపడుతున్నాము.
ఈ మోడల్ ట్రాక్‌ను 21 కిలోమీటర్ల పొడవునా నిర్మించడం జరుగుతుంది." అని అన్నారు.
ఈ సందర్భంగా ORR సర్వీస్ రోడ్డులో సైకిల్ ట్రాక్ నిర్మాణం, సోలార్ ప్యానళ్లు ఏర్పాటు, ఇతర పనుల కోసం ఇటీవలే టెండర్లను ఆహ్వానించారు.
"""/" /
నార్సింగి నుంచి కొల్లూరు వరకు 13 కిలోమీటర్లు, నానక్‌రామ్‌గూడ నుంచి తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ వరకు 8 కిలోమీటర్ల మేర ఈ ట్రాక్ ఉండనుంది.
సర్వీస్ రోడ్డు, ఓఆర్ఆర్ ప్రధాన రహదారి మధ్య ఈ ట్రాక్‌ను అభివృద్ధి చేస్తారు.
జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటికే ఉన్న, నిర్మాణంలో ఉన్న సైకిల్ ట్రాక్‌లతో పోలిస్తే.ఈ ట్రాక్‌లు విభిన్నమైనవి.
ఇవి వర్షం, ఎండ, విపరీత వాతావరణ పరిస్థితుల నుంచి సైక్లిస్టులకు రక్షణ కల్పిస్తాయి.
రెగ్యులర్ ట్రాఫిక్ నుంచి వారికి సేఫ్టీ లభిస్తుంది.అంతేకాదు ఫుడ్ కోర్టులు, నిఘా కెమెరాలు, తాగునీరు, సైకిల్ రిపేర్ షాపులు కూడా ఈ ట్రాక్ వెంబడి అందుబాటులోకి రానున్నాయి.
రీల్ చేసి ఫేమస్ అవుదామనుకున్నాడు.. కానీ, పోలీసులు దెబ్బకు దిమ్మ తిరిగిందిగా